వల్లాల ఆదర్శ పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు

 శాలిగౌరారం మండల పరిధిలోని వల్లాల ఆదర్శ పాఠశాలలో ఈరోజు జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది
ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులు వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్ మోడల్స్ చేసి అందరినీ అబ్బురపరిచారు 
వల్లాల ప్రైమరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు వచ్చి వివిధ రకాల సైన్స్ ప్రాజెక్ట్ లను తిలకించి ఆనందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాధికారి సైదులు సార్ గారు హాజరై విద్యార్థులను మరియు సైన్స్ ఉపాధ్యాయులు అయిన సంపత్ కుమార్,స్వప్న, సరస్వతి, పావని, కొమురయ్య లను అభినందించారు, వీరితోపాటు పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్ గారు మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు
కామెంట్‌లు