రాజాం రచయితల వేదిక సభ్యులు నేతేటి గణేశ్వరరావు, కుదమ తిరుమలరావులు ఆకాశవాణిలో వినిపించిన రచనలు శ్రోతల ప్రశంసలు పొందాయి. శ్రీ పరాభవ నామ తెలుగు సంవత్సరాది ఉగాది సందర్భంగా విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో పద్యరచన విభాగంలో గణేశ్వరరావు, జానపదం విభాగంలో తిరుమలరావులు వినిపించిన రచనలు ఎంపిక కావడంతో ఇరువురికీ ఈ అరుదైన గౌరవం లభించింది. వసంత కవితా కదంబంగా ప్రసారమైన ఉగాది కవి సమ్మేళనంలో పద్యం గేయం వచనం జానపదం అను కవిత్వాంశాలను గణేశ్వరరావు, తిరుమలరావులతో పాటు మొత్తం పన్నెండు మంది వినిపించారు. గణేశ్వరరావు, తిరుమలరావు మరో పదిమంది ప్రకృతి, ఉత్సవం జనజీవనం అనే అంశాలను సుగంధాల కదంబమాలగా అల్లి, తమ తమ సారస్వత సుస్వరాలతో సరాగ మాలికగా నిల్పి, ఆద్యంతం కవి సమ్మేళనానికి ఉగాది శోభను సంతరింపజేసారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ద్వారా ఉగాది రోజున ఉదయం తొమ్మిది గంటల తర్వాత దాదాపు గంటసేపు వీరి కవి సమ్మేళనం శ్రోతలను మంత్రముగ్ధులను చేసింది. గణేశ్వరరావు, తిరుమలరావుల ప్రతిభ రేడియోలో ప్రసారమగుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు.
ఆకాశవాణిలో రాజాం రచయితల ప్రతిభ
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి