ఈకోక్లబ్ లో భాగంగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బక్రిచెప్యాల మం:సిద్ధిపేట అర్బన్ లో సోమవారం పాఠశాల ఆవరణలో పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేసి,నీరందించే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు పూర్ణచందర్రావు గారి కృషి,పట్టుదల మరువలేనిదని ప్రధానోపాధ్యాయులు కొనియాడారు.ఈ విధంగా పక్షులపై ప్రేమ,సానుభూతి, తెలిపినట్లైతే పక్షులు అంతరించిపోకుండా ఉంటాయని పూర్ణచంద్రరావు సార్ అన్నారు.ఈ కార్యక్రమంలో నాగేందర్ రెడ్డి, పూర్ణచంద్రరావు,రమాదేవి, వరుకోలు లక్ష్మయ్య, యాదమ్మ,ఆంజనేయులు గారలు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
బక్రిచెప్యాల పాఠశాలలో పక్షులకు ఆహార ఏర్పాట్లు
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి