అరుణోదయ సాహితీ వేదిక అంతర్జాల ఉగాది ఉత్సవాలు , పంచాంగ శ్రవణం, కవుల ఆత్మీయ కలయిక

అంతర్జాల  పంచాంగ శ్రవణo  డా. జయరాములు  ( rtd కాలేజీ ప్రొఫెసర్, అధ్యాత్మిక పండితులు ) చే   శుక్రవారం జరిగిన కార్యక్రమం  దిగ్వి జయoగా  జరిగింది.ముందుగా   సమూహ అధ్యక్షులు  డా. అరుణ కోదాటిఅతిథులను   స్వాగతo పలుకగా, అయ్యల సోమయాజుల  గారి వేద ప్రవచా నాలతో  కార్యక్రమం మొదలైంది. డా. జయరాములు గారు  పంచాంగ శ్రవణం,  మొదలు పెట్టి ,  పంచాంగ శ్రవణం ఎందుకు  వినాలి,ప్రాముఖ్యత  గురించి  వివరిస్తూ, నూతన  సంవత్సరం లో  దేశకాల పరిస్థితులు, అన్నిరాశుల వారి  ఫలాలు  దాదాపు  గంటన్నర లోపు  వివరించారు.
 తదుపరి  c. నారాయణ  స్వామి  గారు  అతిథులను   ఆహ్వానిస్తూ ఒక్కొక్కరి  గురించి  వారి పరిచయం చదువుతూ  చక్కగా  నిర్వహించారు.ఆచార్య  T. గౌరీశంకర్ గారు,, రామకృష్ణ  చంద్ర మౌళి  గారు, కృష్ణా రెడ్డి గారు, రంగరాజు  పద్మజా గారు  ఉగాది  గురించి, ప్రస్తుతo  దేశకాల  పరిస్థితుల  గురించి  వివరిస్తూ  అందరికీ  శుభాకాంక్షలు  తెలిపారు.
4 గంటల పాటు  సాగిన ఈ కార్యక్రమం లో  అనేక  మంది  కవులు పాల్గొని  చక్కని విషయాలు  చెప్పుతూ  అందరికీ  ఉగాది  శుభాకాంక్షలు తెలిపారు.నారాయణ  స్వామి  ముగింపు  వాక్యాలు  పలుకగా, డా. అరుణ కోదాటి  అందరూ పాల్గొని  సభనువిజయవంతం  చేసినందుకు  ధన్యవాదాలు తెలిపారు.మొత్తo  మీద  ఉగాది సంబరాలు సంతోషంగా  జరిగాయి.
కామెంట్‌లు