మార్చి 20 న జరిగే ప్రపంచ కథా దినోత్సవం సందర్భంగా తెలుగుతల్లి కెనడా, బీ పాజిటివ్, గడుగ్గాయి , తెలుగువాహిని సంయుక్తంగా నిర్వహించిన "ఊ కొడతారా" బుజ్జాయిల కథా కార్యక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల నించి 220 మంది చిన్నారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం 20 గంటల పాటు సాగింది. దీనికి ముఖ్య అతిథులుగా, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ పూర్వ ఉపకులపతి ఆచార్య కొలకలూరి ఇనాక్ గారు, ఆకాశవాణి విశ్రాంత ప్రయోక్త శ్రీ మడిపల్లి దక్షిణా మూర్తి గారు విచ్చేసి, చిన్నారులకు కథల ప్రాముఖ్యతను వివరించి, చక్కని సందేశాలను అందజేసారు. 20 గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమం నిర్వహించడానికి తెలుగుతల్లి కెనడా కమిటీ సభ్యులు, కెనడా నించి అనేకమంది వాలంటీర్లు నెలరోజులకు పైగా పనిచేసారు. అదే విధంగా అనేక పాఠశాలల ఉపాధ్యాయులు, తమ విద్యార్థులకు కథలు చెప్పడంలో ప్రత్యేక శిక్షణనిచ్చారు. కథలు చెప్పడానికి పిల్లలని ప్రోత్సహించిన ఉపాధ్యాయులకు, తల్లితండ్రులకు తెలుగుతల్లి కమిటీ ధన్యవాదాలు తెలియజేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ విజయభాస్కర్ రాయవరం, శ్రీమతి లావణ్య బాలాంత్రపు, శ్రీమతి రత్నమాధవి రాయవరపు, డా. ఉదయశ్రీ చదలవాడ, విమలాప్రసాద్ గుర్రాల, శ్రీమతి ఝాన్సిలక్ష్మి గరిమెళ్ళ, శ్రీమతి సమత రాచమళ్ళ, శ్రీమతి జ్యోతి రాచ, శ్రీమతి సౌమ్య లింగారెడ్డి, శ్రీమతి లక్ష్మి రాయవరపు, శ్రీ సత్య పోతంశెట్టి పాల్గొని, చిన్నారులకు శుభాకాంక్షలు అందజేసారు.
"ఊ కొడతారా" బుజ్జాయిల కథా కార్యక్రమం
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి