విరాట పర్వము చతుర్థాశ్వాసము- 190 వ రోజు
యుద్ధారంభం
ఆ యుద్ధం చూడటానికి దేవతలంతా విమానాలెక్కి ఆకాశ వీధిలో నిలబడ్డాఋ. అర్జునుడు తన దేవదత్తాన్ని పూరిస్తూ అమిత వేగంతో కురు సైన్యాన్ని చేరుకున్నాడు. అతని పరాక్రమానికి కురు సైన్యం బెదిరి పోయింది. అర్జునుడు ఉత్తర కుమారునితో " కుమారా! సైన్యం రెండు భాగాలుగా పోతుంది ఇందులో సుయోధను డెక్కడ ఉన్నాడో తెలుసుకుని యుద్ధం చేయాలి. రధాన్ని సేనకు ఎడమ వైపుగా పోనియ్యి. రాజును పట్టుకుంటే కురు సైన్యం విచ్చిన్న మౌతుంది. మన పని సులభం ఔతుంది గోవులను మళ్ళించడంతో పనౌతుంది. గోవులు ఎక్కడ ఉన్నాయో అక్కడకు వెళితే వాట్ని రక్షించడానికి సుయోధనుడు అక్కడకు వస్తాడు " అన్నాడు అర్జునుడు. అర్జునుడు రథాన్ని ఎడమ వైపు నడిపిస్తూ సైన్యాన్ని కలయచూసి సుయోధనుడు లేడని తెలుసుకుని ముందుకు సాగాడు. పోతూ కృపాచార్యునకు, ద్రోణాచార్యునకు, భీష్ముడికీ తగిలీ తగలనట్లు నమస్కార బాణాలు వేసాడు. అర్జునిని గురు భక్తికి, పెద్దల ఎడ భక్తికి భీష్ముడు, కృపుడు, ద్రోణుడు ఆనందించారు. " అచార్యా ! అర్జునుడు మనతో యుద్ధం చేయక ముందుకు పోతున్నాడంటే సుయోధనుని కోసం వెతుకు తున్నాడు. కనుక మనం సుయోధనుని రక్షించాలి " అంటూ భీష్ముడు సైన్యాలను ముందుకు నడిపించాడు. ఇంతలో అర్జునుని రథం ఆవుల మందలను చేరుకుంది. అర్జునుడు " నేను ఆలమందలకు రక్షణగా ఉన్న సైన్యాన్ని ఎదిరిస్తాను వారిని రక్షించడానికి సుయోధనుడు వస్తాడు. మన చేతికి చిక్కుతాడు " అంటూ అర్జునుడు రథాన్ని తూర్పు దిక్కుకు నడప మన్నాడు. గోవులకు కాపలాగా ఉన్న సైన్యం అర్జునిని శరపరంపర ధాటికి ఆగలేక చెల్లాచెదరైంది. అర్జునుడు గోవులను వెనుకకు మళ్ళించాడు. గోవులు గోపాలురు వెంట రాగా వెనుకకు పరుగెత్తాయి. అర్జునుడు తనరధాన్ని గోవులకు సైన్యాలకు మధ్యగా నిలిపి గోవులకు రక్షగా నిలిచి గోపాలురను చూసి " మీరు గోవులను తీసుకు వెళ్ళండి " అన్నాడు. గోగణం మత్స్యదేశ పొలిమేరలో చేరుకున్నాయి. కురు సేనలు అర్జునిని చుట్టుముట్టాయి.
విరాట పర్వము చతుర్థాశ్వాసము సమాప్తం
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి