సుప్రభాత కవిత : - బృంద
మనసున నింపే మమతవై 
బ్రతుకును నడిపే తోడువై 
పుడమిని పుత్తడి పూయగా 
పిలిచిన పలికే నేస్తం నీవే!

కాలం నీవే  కర్తవి నువ్వే 
కదిలే చక్రపు ఇరుసువి నువ్వే 
కరుకుగ తోచే కర్మలకు 
కర్తవు నీవే భర్తవు నీవే!

పూచే పూవుల రంగు నీవే 
ఊగే ఆకుల మెరుపు నువ్వే 
సాగే గాలికి  నేస్తం నువ్వే 
ఆగే బ్రతుకుల గమ్యం నువ్వే!

మాయల వలలు పరిచేది 
కన్నుల కలలు విరిచేది 
తెన్నులు తెలియక మార్చేది 
మిన్నుల నడిచే దైవం నువ్వే!

తప్పులు తెలిసీ చేసేస్తూ
గొప్పగ ఉన్నామనుకుంటే 
తిప్పలు పడక తప్పదని 
చెప్పక..నవ్వే దొరవి నువ్వే!

నువ్వే దైవం 
నీ రాకే ధైర్యం 
నీ చూపే సౌఖ్యం 
నీ కృపే భాగ్యం 

బ్రహ్మాండానికి  అండవి నువ్వే!
ఆదిదైవానికి వందనాలతో 

🌸🌸సుప్రభాతం 🌸🌸


కామెంట్‌లు