మా ఊరి చెల్మె నీరు : - ఎడ్ల లక్ష్మి -సిద్దిపేట
మా ఊరి నీరు చూశారా 
బుగ బుగ పైకి వస్తుంది 
అవి చెల్మె  లోనీ నీరు 
తీయ్యనైన త్రాగు నీరు 

పెరటి లోన జామ చెట్టు
కెమికల్ ఏది చల్ల లేదు 
తీయ తీయని పండ్లు 
కోసి తింటే కమ్మగుండు

ఇంటి ముందు వేప చెట్టు 
చక్కనైన నీడను యిచ్చి 
చల్ల చల్లని గాలి వీచుచూ
ఎంతో ఆరోగ్యాన్నిచ్చును

దొడ్డిలోన గేదలు చూడగా 
కడుపునిండా గడ్డి తిని 
కడవ నిండ పాలిచ్చును
కుండలోన కాచి పాలు 

అమ్మ గురిగి లో పోయగా 
రుచికరమైన పాలు తాగి 
ఆటలు ఎన్నెన్నో ఆడుతూ 
మేమారోగ్యంగా ఉంటాము 


కామెంట్‌లు