గాజు బొమ్మలు. : - డా ప్రతాప్ కౌటిళ్యా.
ప్రకృతి బీభత్సాలు నేరాలు కావు 
హత్యలు కావు సత్యాలు. 
కోరలు పీకిన పాములు కరిస్తే 
ప్రాణాలు గాల్లో కలుస్తాయని 
గగ్గోలు పెట్టే గందరగోళం
 భూగోళమంతా ప్రచారం జరుగుతుంది.

ఇప్పుడు విషం కాదు 
విషయం ఎక్కి 
మనుషులు మరణిస్తున్నారని తేలిందీ
చెత్తలోంచి పుట్టే విత్తనం 
ఇప్పుడు కొత్తగా మత్తులోంచి పుడుతుంది. 

చికిత్స లేని గాయాలు రోగాలు 
గాలితో మాన్పుతూ అన్యాయం న్యాయ శాస్త్రం చదువుతోంది. 
నిప్పును ఆర్పే నీరు ఊపిరాడక మాటలు పడిపోయి కోమాలోకెళ్ళింది.
మళ్లీ జన్మిస్తానని భరోసా ఇచ్చి 
భూమిపై ప్రేమ చచ్చిపోయింది. 

చేప శరీరాన్ని కాల్చుకు తింటున్న మంట 
కడుపు మంటల్ని ఆర్పి వేస్తుంటే 
దీపాలు ఆర్పి నిద్రపోయిన చీకటి రేపటి వెలుగును మళ్ళీ కంటున్నది. 

పచ్చి నెత్తురు తాగే కత్తి ఎప్పటికీ చైతన్యం పొందలేదు. 
శరీరం లేని పేర్లు శరీరం లేని ఆకారాలు 
గాజు బొమ్మలు -పుకార్లు గాలిగోపురాలు మాత్రమే.!?

డా ప్రతాప్ కౌటిళ్యా 
శ్రీ శ్రీ కళావేదిక సమన్వయకర్త.

కామెంట్‌లు