ఊషన్నపల్లి పాఠశాల విద్యార్థుల ప్రతిభ


 --గురుకుల ప్రవేశ పరీక్షలో సత్తా చాటిన చీర రుతిక, రితిక 
-- పిల్లలిద్దరికీ అభినందనల వెల్లువ 

 ఇటీవల నిర్వహించిన గురుకుల పాఠశాలల ప్రవేశ పరీక్షలో ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థినులు ఇద్దరు అత్యంత ప్రతిభ కనబరిచి, పాఠశాలలో ప్రవేశం కోసం అర్హత సాధించారు. ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చీర రుతిక చీర రితిక అనే ఇద్దరు విద్యార్థులు 4వ తరగతి చదువుతున్నారు. ఇటీవల గురుకుల సొసైటీ ఆధ్వర్యంలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశం కోసం 
 నిర్వహించిన ప్రవేశ పరీక్షకు వారు హాజరయ్యారు. ప్రవేశ పరీక్షలో వారు అత్యంత ప్రతిభ కనబరిచి, గురుకుల పాఠశాలలో సీటు సాధించారు. ఇద్దరు పాఠశాల పిల్లలు గురుకుల పాఠశాలలో సీటు సాధించడం పట్ల పాఠశాల చైర్పర్సన్ పెండ్లి సరూప, ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు, అమృత సురేష్ కుమార్, కొనుకటి శ్రీవాణి, బండారి స్రవంతి, గోపిశెట్టి సుప్రియతో పాటు పిల్లల తల్లిదండ్రులు, గ్రామస్తులు, పలువురు హర్షం వ్యక్తం చేశారు. పిల్లలకు వారు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న బాలబాలికలకు ప్రాథమిక స్థాయి నుంచి నవోదయ, సైనిక్ స్కూల్,  గురుకుల, ఆదర్శ పాఠశాలల ప్రవేశ పరీక్షలతో పాటు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ చేస్తున్నామన్నారు. పోటీ పరీక్షల పట్ల వారికి అవగాహన కల్పించడమే కాకుండా వాటికోసం ప్రత్యేక శిక్షణను ఇస్తున్నట్లు ఈర్ల సమ్మయ్య తెలిపారు. పాఠ్యపుస్తకాలతోపాటు స్పోకెన్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, క్విజ్ పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రాబోవు కాలంలో ఊషన్నపల్లి ప్రభుత్వ పాఠశాలలో చదివిన పిల్లలు ఉన్నత స్థాయి అధికారులుగా స్థిరపడతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
కామెంట్‌లు