పెట్రోలు,డీజిలు,గ్యాసు కొరతలు సృష్టించుదురు కొందరు
గాలివార్తలను వ్యాప్తి జేయుదురు మరికొందరు
లేని కొరతలను ఊకదంపుడు వార్తలతో చాటింపు వేయుదురు ఇంకొందరు
సమర్థ నాయకత్వమున భారత దేశమ్ము సంక్షోభముల నెదుర్కొనగలదు
వలదు వలదు ఆందోళన సామాన్యజనులకు
దైవము దారిజూపును నమ్మకము కల్గి ఉండుము
+++++++++++++++++++++++++++++++++++++++
కలియుగ రాక్షసులు రచ్చ చేయుచుందురు
వికృత మాటలతో మైకులను
అపవిత్రము చేయుదురు
ఆట కొందరికి,సంకటము మరికొందరికి,
శాంతి వహించి,విచక్షణతో తెలిసికొనవలయు
జ్ఞానము రక్షణనిచ్చు ఇది సత్యము
+++++++++++++++++++++++++++++++++
హొర్మోజు దాటినవి ఆరు నౌకలు
క్షేమముగా భారతదేశమునకు జేరినవి
ఇంధన నిల్వలు యున్నవి కావలిసినంతగ
అసత్యవార్తలు లోకమంతా తిరుగుచున్నవి
కనికట్టు చేసెడి అధముల మాటలు వినబోకుడు
నమో యుండగ భయము విడువుడు
కాలమహిమను తెలిసికొని మసలుకొనుడు
+++++++++++++++++++++++++++++++++++++
రాక్షసక్రీడలు సల్పు నరరూపరాక్షసులు
కరాళనృత్యములు జేయుదురు
నట్టనడివీధులందు
నిస్సిగ్గుగ నీచరాజకీయముల
నడుపుదురు
నికృష్ట కలికాలాసురుల నిర్లజ్జా
కార్యకలాపములపై ఉక్కుపాదము మోపగవలెను
++++++++++++++++++++++++++++++++
వంటనూనెలను సలసలా కాగించిరి కొద్దిదినముల కింద
చమురును చాపకింద నీరులా
వేడెక్కించిరి నేడు పుకారుగా
గ్యాసును గందరగోళపరిచి
గబ్బును లేపుచుండిరి నిత్యము
మార్కెట్టును మాయజాలమున బంధించి,అన్నింటిని అటు ఇటు కదుపుచుండిరి
ఏమి మాయరోగమో ఇది మానవాధములకు
ఇల్లు కాలిపోవుచుండగా చలిమంట కాచుకొను చందంబున
+++++++++++++++++++++++++++++++++++++++++++

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి