తాతయ్య ఎప్పుడు కవితలేనా
ఈ రోజు మాతో హొలీ ఆడాలి అన్న
మనుమరాలు మనస్విని మనుమడు గౌతమ్ తో
మీ తాతయ్య చిన్నపిల్లడు కాదు ఆడటానికి అన్న
ఏభై సంవత్సరాలు నాతో కాపురం చేసిన అర్థా0గితో
నానమ్మ నువ్వు ముసలిదానివే
తాతయ్య ఏడేండ్ల పిల్లాడు
మా స్నేహితుడని రా తాత అంటు
హైదరాబాద్ లో పదవ అంతస్తుల భవనంపై
హొలీ అంటు మనుమలతో రంగులు జల్లుకుని
డెబ్బది సంవత్సరాలు దాటిన వయస్సులో
ఆనందంగా గడిపితే మా తాతయ్య ఎంతమంచివాడో మాతో ఆడాడని
మా ఇంటి ఇల్లాలుకి చెబితే
ఓ మీ తాత సంగతి ఏభై సంవత్సరాలయి
నాకు తెలియనిది కాదని నా వైపు చూసి
మనుమలను ఆప్యాయంగా దగ్గరగా తీసుకుంది...!!
...............................
మనుమలతో హోలీ: - కవిమిత్ర, సాహిత్యరత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్- (పుష్యమి)-విశాఖపట్నం.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి