కళాకారుడి కష్టాలు
కనుమరుగవుతున్న వేళ…
వేదికలు మూతపడితే
వాళ్ల ఊపిరి కూడా ఆగిపోతుంది;
చప్పట్లు లేకపోతే
మనసే మౌనమైపోతుంది…
కలలతో వచ్చిన వారు
కాలంతో పోరాడుతున్నారు;
కళను నమ్ముకున్న వారు
జీవితాన్ని మోస్తున్నారు…
ఒకప్పుడు వెలుగుల మధ్య
వెలిగిన ఆ ముఖాలు—
ఇప్పుడు గుర్తుల కోసం
గడపలు తడుతున్నాయి…
పాట పాడిన గొంతులు
పని కోసం తలవంచుతున్నాయి;
నాట్యం చేసిన పాదాలు
నడవడానికి కూడా అలసిపోతున్నాయి…
ఇది వారి తప్పు కాదు,
ఇది కాలం మార్పు మాత్రమే;
కాని కళను మర్చిపోవడం
మన తప్పే కదా…
అందుకే—
రండి… కళాకారుడిని కాపాడుకుందాం,
రండి… కళను నిలబెట్టుకుందాం;
ఒక చప్పటి ఇచ్చినా
ఒక జీవితం నిలుస్తుంది…
ఒక చూపు చూసినా
ఒక ఆశ పుడుతుంది;
మన మద్దతు ఉంటేనే
వారి కళ బతుకుతుంది…
కనుమరుగవుతున్న ఈ వెలుగును
మళ్లీ వెలిగిద్దాం మనం;
కళాకారుడి జీవితం
మళ్లీ రంగస్థలం పై మెరవాలి
వారి కళ్లలో ఆనందం చూడాలని
కోరుకుంటూ
+++++++++++++++++++++++
మంజుల పత్తిపాటి-చరవాణి 9347042218
మాజీ ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్,
యాదాద్రి భువనగిరి జిల్లా
తెలంగాణ రాష్ట్రం.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి