పాలఖండ్యాం ఎంపియుపి పాఠశాలలో సాంఘిక శాస్త్రోపాధ్యాయునిగా పనిచేస్తున్న కుదమ తిరుమలరావు, జాతీయ స్థాయి కవితల పోటీల్లో విజేతగా నిలిచారు. తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి సుర్డేపల్లి కేంద్రంగా అంతర్జాలం ద్వారా రామదాసు సాహితీ కళా సేవా సంస్థ నిర్వహించిన పోటీల్లో తిరుమలరావు పాల్గొని స్పెషల్ జ్యూరీ పురస్కారం సాధించారు. ఐ.ఎస్.ఓ. గుర్తింపు పొందిన రామదాసు సాహితీ కళా సేవా సంస్థ, ఉగాది సందర్భంగా జాతీయ స్థాయి కవితల పోటీలకు కవితలను ఆహ్వానించగా, తిరుమలరావు పరాభవ జయీభవ అనే కవితను పంపగా స్పెషల్ జ్యూరీ పురస్కారానికి ఎంపికై నగదు పారితోషికం ప్రశంసాపత్రంలను పొందారు. ఉగాది పోటీల నిర్వాహకులు, సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు దూత రామకోటేశ్వరరావు, ఉపాధ్యక్షులు డి.రామలక్ష్మి, విశ్వవిఖ్యాత సాహిత్య సామాజిక సేవా సమితి భీమా శ్రీనివాసరావు, న్యాయనిర్ణేతల బృందం తిరుమలరావును అభినందిస్తూ ప్రశంసాపత్రాన్ని, నగదు పారితోషికాన్ని పంపారు. తిరుమలరావు ఉగాది కవితల పోటీ జాతీయ విజేతగా స్పెషల్ జ్యూరీ పురస్కారం సాధించుట పట్ల రాజాం రచయితల వేదిక కన్వీనర్ గార రంగనాథం తదితరులు హర్షం వ్యక్తం చేసారు
తిరుమలరావుకు రామదాసు ఉగాది స్పెషల్ జ్యూరీ విజేత పురస్కారం
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి