అంతర్యామి కి నా అక్షరాంజలులు: - కవిమిత్ర ,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-హైదరాబాద్.
సాహిత్యమే శ్వాసగా
సాహితీ సభలలో పాల్గొంటు
సరస్వతీ మాత మానస పుత్రుడివై
శతావధాన, అష్టావధానలలో పాల్గొని
మహిళలే
ఆకాశంలో సగం అన్నిటా వారే మనుగడకాధారమని
'విశిష్ట తెలుగు మహిళలు' అనే పుస్తకం
భారత దేశ దశా దిశా మార్చి
వసుదైకానికే పరిపాలనలో
మార్గదర్శకుడైన
మన ప్రియతమ ప్రధాని గురించి
'నవతరం నేత నరేంద్రమోడీ 'అనే రచన ద్వారా
'జ్యోతిర్మయి: అనే ఆధ్యాత్మిక  వ్యాసాలతో
తెలుగు భాషా ప్రేమికుల మదిని నిలిచి
అభినవ వ్యాసుడై మహాభారత పాత్రలను గ్రంథ రూపంలో వివరించి
సుమారు రెండు వేల పుస్తక సమీక్షలు చేసి
కుర్తాళం పీఠాధిపతి
శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారిచే సత్కరించబడి
కవి సమ్మేళనంలలో
క్విజ్ పోటీలను నిర్వహిస్తు
సాహితీవేత్తగా ,రచయితగా నిరంతరం సాహిత్యమే  శ్వాసయైన
భారతీయ విద్యాలయ కళాశాల లో
మీతో ముప్పది ఐదు సంవత్సరాలు కలసి పనిచేసిన నన్ను
రసాయనం జోడించు
ప్రసాదు నీవు వ్రాయగలవని ప్రోత్సహించిన
నా సాహితీ జీవితానికి ప్రేరణ మీరే
మీరు  పురస్కారాలకేకాదు
రాష్ట్ర పురస్కారం 'కళారత్న'కే వన్నె తెచ్చిన
సరస్వతీమాత  మానసపుత్రులు
డాక్టర్ దామెర వేంకట సూర్యారావు గారు
మీకివే నే అందిస్తున్న అక్షర కుసుమాలు..!!


( మిత్రులు డాక్టర్ సూర్యారావు గారికి రాష్ట్రపురస్కారం కళారత్న వచ్చిన సందర్భంగా వ్రాసినది.)
..........................
కామెంట్‌లు