ఊరు ఊరు మాది
పల్లెటూరు మాది
పచ్చని పొలాలు మావి
పాడిపంటలు మావి
కల్లాపు చల్లిన ముంగిట్లో
ముత్యాల ముగ్గులు మావి
మామిడాకుల తోరణాలతో
అందమైన గుమ్మాలు మావి
ఇంటి ముందు పూల పందిరి
ఇంటి వెనుక బీర,సొర పందిరి
ఘర్ష నిండా ధాన్యముతో
నిండుకుండ వోలే మా ఇల్లు
కలితి లేని వంటలతో
కడుపునిండ భోజనాలు
చల్ల చల్లని గాలితో
కంటి నిండా నిద్ర మాకు

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి