చీకటిలో
చిమ్మ చీకటిలో...
కాలమనే కడలిలో
శోకమనే పడవలో...
ఓ మనిషీ...! ఓ మనిషీ..!!
ఎక్కడికి నీ పయనం..?
ఎందాక నీ పయనం...?
నాడు ప్రేమబంధాలతో పెనవేసి
ప్రేమ పాషాలతో బంధించి
నేడు మమతలనే మరిపించి
మనసులనే విరిచేసి ఎందుకో
భగవంతుడు బంధాలు తెంచేసె...
బ్రతుకంతా
అంధకారమయమైపోగా...
ఓ మనిషీ..! ఓ మనిషీ..!!
ఎక్కడికి నీ పయనం...?
ఎందాక నీ పయనం....?
జాలరి వలలో చిక్కిన చేపలా
వేటగాని బాణం గుచ్చుకున్న లేడిలా
విధి చేతిలో చిక్కి విలవిలలాడేవు
రెక్కలు విరిగిన పక్షివై గిలగిలలాడేవు
ఓ మనిషీ..! ఓ మనిషీ..!!
ఆ దైవమే పగబడితే
ఇక ఎవరు నీకు దిక్కు ఎవరు నీకు దిక్కు?
ఎండిన చెరువును కాదు
జలకళతో నిండిన చెరువును చూడు
మోడువారిన మొక్కను కాదు
పుష్పించి ఫలించే పచ్చని వృక్షాన్ని చూడు
బ్రతకాలనే చిన్నఆశ చిగురుస్తుంది నీలోన
ఓ మనిషీ..! ఓ మనిషీ..!!
ఆ చిరు ఆశే చిరుదీపంగా...
సాహసమే ఊపిరిగా ముందుకు సాగాలి
కొత్త బంగారులోకం కోసం అన్వేషించాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి