జీవిత మే ఆనంద మయం....! :-కో రా డ నరసింహా రావు!
దినకరుడు ఇనుడు...! 
  వెలుగులు ప్రసరించే వా డీ భాస్కరుడు...!! 

దయా మయుడైన ప్రత్య క్ష దైవమీ కర్మ సాక్షి...! 
 ఈతడు కదా నిజమైన ప్రేమ మయుడు...!! 

భ్రమ ప్రమాదాదుల నుండి మనల రక్షించు జ్ఞానప్రదాత ఈతడే కదా...! 
     నీటికీ అన్నమునకు ఆరోగ్యమునకు.... 
   ఐశ్వర్యమునకును మూలము ఈ ప్రత్యక్ష దైవమే కదా...!! 

పంచ భూతముల ప్రేమ పరోక్షమె యైనా... 
   ప్రత్యక్ష ప్రేమ మయుడు 
 తన సాక్షాత్కారముతో
మనలోని రుగ్మతల నెల్ల తొలగించు 
  దివ్య జ్ఞాన ప్రకాశ విరాజ మానుడు... 
  శ్రీ సూర్య దేవునకు ప్రణమిల్లు తున్నాను💐🙏🌷🙏
 ఓం నమో ఆర్కాయ, ఆదిత్యాయ , అనంత ప్రకాశాయ నమో న్నమః
💐🙏🌷🙏💐🙏

కామెంట్‌లు