సమాజశ్రేయస్సే జీవితలక్ష్యమనిఅక్షరమే ఆయుధంగా చేతబూనితనదైన శైలిలో ప్రజలకు ప్రేరణనిచ్చిజన్మకు కారణమైన తండ్రి రజాకార్లకు వ్యతిరేకంగావిప్లవభావాలతో పోరాడిన ప్రభావంతోప్రజాహితమే తనహితమనివిద్యార్థి దశలోనే కవిత్వం కథలతో జరిగే అన్యాయాలను తెలిపిమంజీరా రచయితల సంఘంను ఏర్పరచిఏడు కవితా సంకలనాలను వెలువరించినడాక్టర్ నందిని సిద్దారెడ్డి గారు సమాజకవి.తెలంగాణ ఉద్యమ పోరాటంలోఒకే గంట వ్యవధిలో రచించిననాగేటి చాల్లల్ల కవిత సంపుటి ద్వారాసంస్కృతి సంప్రదాయాలను వివరించిన ఘనాపాఠిభూమి స్వప్నం కవితకు దాశరథి పురస్కారంప్రాణహిత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారంనాగేటి సాలల్లో నా తెలంగాణ పాటకు ఉత్తమగేయ రచయితగా నందిపురస్కారంతెలంగాణ సాహిత్య అకాడమీ తొలి చైర్మన్ గామీరు చేసిన సాహితీ కృషి'నభూతో నభవిష్యతి'కరోనా సమయంలో సమాజ పరిస్థితిపై మీరు వ్రాసిన'అనిమేష' కవితాసంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం రావడం తెలుగు వారికే గర్వకారణం.ఎవరేమనుకున్నాచిటికెన వేలులా జీవించలేనుహృదయం మార్చుకుని ఉత్సవ విగ్రహం నుందు ఉరేగలేనుఅని నిజాన్ని నిర్భయంగా వ్యక్తీకరించేఅక్షర సూర్యుడుఆచార్యునిగా ఎందరినో తీర్చిదిద్దిన ఉత్తమ అధ్యాపకులు .ఆప్యాయంగా సాహితీ సభలలో పలుకరించేసరస్వతీ మానస పుత్రులుడాక్టర్ నందిని సిద్దారెడ్డి గారుమీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికే వన్నె తెచ్చిన సందర్భంగాఅందుకోండిమీకివే నే సమర్పిస్తున్నఅక్షరాంజలులు..!!..........................
అక్షరయోధునికి నా అక్షరాభినందనలు : - కవిమిత్ర ,సాహిత్య రత్న-ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ ( పుష్యమి)-హైదరాబాద్.
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి