పిక సంతతికి శాపం,పాడలేని గొంతు.సంవత్సరంలో వసంతమందు సవరించు వసంత కాల రసాల కిసలయముల
నారగించి, సప్త స్వరాలలో రాణి
పాటలకు పట్టుకొమ్మ పంచమ స్వరం వనప్రియచయమునకు వరం. మనోహరం.
ఆకులు రాలి ఆవేదనలో అనోకహము (చెట్టు) అంతలో చిగుళ్ల చిరునవ్వుల జల్లులు, అమ్మ,అదేనమ్మ కొమ్మ మనసు ఆనంద తాండవం.
చిగురులు తెచ్చు
తెచ్చి మనకిచ్చు
మధురచూత ఫల
రస మాధుర్యము,
ఆంధ్రుల రుచికి సాక్షి
ఆవకాయలోని కమ్మదనం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి