సంధ్యా సమయాన
ఒక ఇంద్రధనస్సు పూసింది
పర్వత శిఖరాన
ఒక పొద్దు పొడిచింది
జలపాతం అంచుల్లో
ఒక పాతాళం దాగుంది
గగన మేఘాల హృదయంలో
అనురాగాల రాగం ఉంది
అదే రఘునందనునీ మది.
రఘునందనుని వాణి లో
కోటి వీణలున్నవి
రఘునందనుని నేత్రాలలో
జాతి రత్నాలున్నవి
రఘునందనుని మేనులో
వేల వేణువులున్నవి
రఘునందనుని ఆశీర్వాదములో
నాలుగు వేదాలున్నవి.
ఆయన రాల్చిన అక్షరాలు
అరణ్యాలైనవి
ఆయన ఎగిరేసిన పక్షులు
ఆకాశంలో మెరిసే నక్షత్రాలైనవీ
ఆయన నిర్మించిన మాటలు
పాఠశాలలైనవి
ఆయన బోధించిన పాఠాలు
కోట గోడ లైనవీ
భూమిపై పారే జీవనదులవి
భూమిపై వెలసిన జాతకాలవి
ఆయన జీవితం ఒక ప్రయాణం
ఆయన సేవ ఒక వాయుసేన
ఆయన ఒక గ్రంథపు వనం
ఆయన ఒక సుగంధ పరిమళం
ఆయన నిరంతరం పారే జలం
ఆయన ఒక ధర్మ జీవి
ఆయనే మన శర్మాజీ.
నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం ఎంఈఓ శ్రీ రఘునందన శర్మ గారి పదవీ విరమణ సందర్భంగా.
29/03/2026.
డా ప్రతాప్ కౌటిళ్యా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి