అహాల మధ్య
ఆధిపత్య పోరులో
అల్లాడిపోయే భూభాగానికి
అవిరళ శాంతి ప్రదాతవై....
అనవసర నష్టాలను
ఆశనిపాతంగా తెచ్చే
అని అవనికి క్షేమం కాదని
అధ్యక్షులకు జ్ఞాన మీయగా...
అమాయక జీవులు చెదిరి
అలజడికి లోనై బెదరి
అరచేత అసువులు పట్టి చేసే
ఆర్తనాదాలకు ఆసరాగా....
తలకెక్కిన అధికారం
తుత్తునియలు చేసి
సహకారం సహనం
సహగమనమే మిన్నయని
రక్షించాల్సిన ప్రభువులు
రాజ్యాలను భస్మంగా చేసి
ధరణిని అశాంతిలో ముంచే
దాడులు.. దౌర్జన్యాలు మానేలా
మానవ జీవన స్రవంతిని
క్షేమముగా కాపాడి
అసురుల పీచమణిచేలా
అరుదెంచి ప్రభోదించాలని
ఆర్తిగా ఆదిత్యుని వేడుతూ
🌸🌸సుప్రభాతం 🌸🌸
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి