చిల్డ్రన్స్ వరల్డ్ ప్రత్యేక సంచికను ఆవిష్కరించిన ఆచార్య ఎల్లూరి శివారెడ్డి

 ఉగాది, రంజాన్ పండుగల సందర్భంగా చిల్డ్రన్స్ వరల్డ్ ప్రత్యేక సంచికను తెలంగాణా సారస్వత పరిషత్ అధ్యక్షులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి గారు మంగళవారం విడుదల చేశారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిల్డ్రన్స్ వరల్డ్ సంస్థ విద్యార్థి, విద్యార్ధినుల కోసం, వారిలోని ప్రతిభను వెలికి తీసి భావిలో భారతావని కీర్తి ప్రతిష్టలను ఇనుమడించేలా కృషి చేస్తుందని, అందుకు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ మక్కపాటి చంద్రశేఖర్ ను అభినందించారు. ముందుగా చిల్డ్రన్స్ వరల్డ్ జనరల్ సెక్రటరీ, మ్యాగజైన్ చీఫ్ ఎడిటర్ పి యన్ భానుప్రకాష్ మాట్లాడుతూ ఈ ప్రత్యేక సంచికను తెలంగాణా సారస్వత పరిషత్ అధ్యక్షులు, తెలుగు విశ్వావిద్యాలయం మాజీ కులపతి, సాహితీవేత్త, కవి, పరిశోధకులు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి చేతులమీదుగా విడుదల చేయడం చాలా ముదావహమని, వారి ఆశీస్సులు, ప్రోత్సాహం ఇటువంటి సంచికకు చాలా అవసరం అని తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో చిల్డ్రన్స్ వరల్డ్ ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్ హర్షవర్ధన్, బి హెచ్ ఇ యల్ విశ్రాంత పబ్లిక్ రిలేషన్స్ డీప్యూటీ జనరల్ మేనేజర్ ఎస్ చక్రపాణి,నిజాంపేటలోని రాజధాని
 రెసిడెన్ష్ యల్ స్కూల్ ప్రిన్సిపాల్ శ్రీమతి ఐ. దీపిక, వైస్ ప్రిన్సిపాల్ కే వెంకటేశ్వర రావు మాట్లాడారు. చంద్రమోహన్, రవి అనుపాలా తదితరులు పాల్గొన్నారు. చివరగా తెలంగాణా సారస్వత పరిషత్ కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య మాట్లాడుతూ ఈ సంచికలో పెద్దవాళ్ళ ఆర్టికల్స్ తో బాటు పిల్లల రచనలు, చిత్రాలు ఉండడము వారిని రచనా వ్యాసంగం వైపుకు, చదివి విషయాలు గ్రహించడానికి దోహద పడుతుందని చిల్డ్రన్స్ వరల్డ్ సంస్థ నుకొనియాడారు.
🌸🌷🌸
కామెంట్‌లు