విశాఖపట్నం మధురానగరంలో వైభవంగా సీతారామకల్యాణ మహోత్సవం.

   విశాఖపట్నం మధురానగర్ లో సీతారామ సేవా సమితి మరియు విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో  సీతారాముల కల్యాణ 20 వ వార్షికోత్సవం ఘనంగా  మూడు రోజులు జరిగిన సందర్భంలో  స్థానిక భారతీయ విద్యాకేంద్ర  విశ్రాంత రసాయన శాఖాధిపతి  కవి, రచయిత ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్ దంపతులకు ఘన సత్కారం  ఆంధ్రవిశ్వవిద్యాలయ నాట్య ఆచార్యులు డాక్టర్ విజయవేణి శిష్యులు అత్యంత అద్భుతంగా నాట్యప్రదర్శన ,నేటి యుద్ధోన్మాద అనిశ్చిత పరిస్థితుల దృష్ట్యా శ్రీరామ శాంతిహోమం  కార్యవర్గ నిర్వాహకులు ఆంధ్రవిశ్వవిద్యాలయ ఆచార్యులు శ్రీమతి బి.కళ్యాణి,సీనియర్ లాయర్ అప్పారావు ,రాంబాబు,సుగుణ ,శాంతి మరియు కార్యవర్గ సభ్యులు ,పుర ప్రజలు పాల్గొన్నారు భాగవతుల శ్రీనివాసశర్మ  ఆధ్వర్యంలో సీతారాముల రాముల కల్యాణం శాంతి హోమం పూర్ణాహుతి జరిగింది జై శ్రీరామ్ అంటు శ్రీరామనామంతో  భక్తులు పాల్గొనడం తదనంతరం సుమారు మూడువేల మందికి అన్న సంతర్పణ జరిగింది. ప్రసాద్ మాష్టారు శ్రీరాముని సన్నిధిలో సత్కారం మరువలేనిదని సీతారాములు ఆదర్శ దంపతులు శ్రీరాముడు వసుదైకానికే ఆదర్శమని చెప్పారు...!!
కామెంట్‌లు