చిత్ర స్పందన : -.. కోరాడ నరసింహా రావు!
శిష్ఠ రక్షణకై... దుష్ట సంహా రము గావించిన పిదప... 
   శా0తించిన ఉగ్ర నార సింహా....! 
 సుఖాసీనుడవై సేదదీరు చుంటివా....! 

ఇది సత్య యుగము గాదు...!
త్రేతా, ద్వాపర యుగములును గావు...!!
 ఇది కలియుగమయ్య...!!! 

స్వే త గుర్రము నెక్కి.... 
 చేత ఖడ్గము బూని, వచ్చెదనంటివి....! 
  ఇదేమి చోద్యం...!! 

బరిసెలు,బల్లెములు గావు
  కత్తులు, డాలులును గావు..., 
 తుపాకులు,బాంబులను మించు అణు బాంబులు గల్గిన...దుష్ట నరులు వీరు
 ఆ ఖడ్గ ముతో... వీరి నె టు ల నిర్జించెదవు...!? 

ఏమో లే.... అంతటి ఘనుడవె నీవు...! 
 వామనుడ వై వచ్చి త్రివిక్ర ముడ  గాలేదా...!! 

మాయలు, మహిమలు దెలిసిన పరమాత్మవె నీవు గా....! 
  నమో న్నమః   
       నమో న్నమః
     నమో న్నమః నార సింహా....!! 
        ****


కామెంట్‌లు