అందరి ఆరాధ్య దైవంశ్రీ రామచంద్రుడే...!: - పోలయ్య కవి కూకట్లపల్లి-అత్తాపూర్, హైదరాబాద్
రఘువంశ రాజకుమారుడు
క్రమశిక్షణకు ప్రతిరూపుడు
ధనుర్విద్యలో ఆరితేరినవాడు
ఒకే మాట ఒకే బాణం
ఒకే భార్యగల ఏకపత్నీ వ్రతుడు...

సకల గుణసంపన్నుడు
ప్రశాంత చిత్తం గలవాడు
సాహసికుడు సమర్థుడు
సత్యవాక్య పరిపాలకుడు...

నిత్యం
సత్యమే పలికే వాడు
నీతిమంతుడు
దూరదృష్టి గలవాడు
దృఢసంకల్పస్వరూపుడు
ధర్మాత్ముడు సత్యస్వరూపుడు...

సమస్త కార్యాలలో సమర్థుడు
సర్వజీవుల పట్ల దయామూర్తి
సకల ప్రాణుల శ్రేయస్సు కోరువాడు
ఘనచరిత్రగల ఘనుడు త్యాగధనుడు
దయ, జాలి, ప్రేమలకు నిలయం
దశరథ నందనుడు...

కోటిసూర్యుల తేజస్సు కలవాడు
ఎదుటివారిలో మంచినే చూసేవాడు
సమస్తలోకాల్లో సాటిలేని వీరుడు
సమస్యలను చిరునవ్వుతో స్వీకరించే
సుందరరూపుడు ఈ అందాలరాముడు...

ఆందోళనలేని స్థితప్రజ్ఞుడు
అసూయా, ఆవేశాలకు
అతీతుడు  అయోధ్య రాముడు
దేవతలకే భయాన్ని కలిగించే
ధీశాలి,రాక్షసరాజు రావణాసురుని 
సంహరించినవాడు క్రోధం, కామం
ఇంద్రియాలను జయించినవాడు...

అట్టి పురుషోత్తముడిని
మన పాలకులందరూ
ఆదర్శంగా తీసుకుంటే
వచ్చేది రామరాజ్యమే కదా...

ప్రజాస్వామ్యంలో ప్రజలంతా
సుఖశాంతులతో జీవించరా..?
ధర్మం ధరణిపై దద్దరిల్లదా...
ప్రగతి దేశమంతా ప్రజ్వరిల్లదా..?
(అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు)



కామెంట్‌లు