చంద్రకళ.దీకొండ కు వయస్వి కవితారత్న పురస్కారం
 హైదరాబాద్ మల్కాజిగిరికి చెందిన ఉపాధ్యాయిని,కవయిత్రి , రచయిత్రి చంద్రకళ.దీకొండ ఇటీవల జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన అంతర్జాల కవితల పోటీలో భాగంగా వారిని వయస్వి కవితారత్న పురస్కారం వరించింది.యనమండ్ర సాహితీ వేదిక అధ్యక్షురాలు వరలక్ష్మి యనమండ్ర గారు మరియు కార్యనిర్వాహక అధ్యక్షులు పొర్ల వేణుగోపాలరావు గారు ఈ పురస్కారాన్ని అందించారు. చంద్రకళగారు పలు సాహితీసంస్థలు నిర్వహించిన కవితాపోటీలలో పాల్గొని,అనేక ప్రశంసాపత్రాలను మరియు నగదు బహుమతులను సైతం పొందారు. తానా గాటా వంటి అంతర్జాతీయ సంస్థలు నిర్వహించిన పోటీలలో కూడా పాల్గొని,ప్రశంసాపత్రాలను పొందారు. మూడు కవితా సంపుటులను వెలయించారు.ఈ సందర్భంగా  విద్యార్థులు, సహోపాధ్యాయులు మరియు సాహితీమిత్రులు చంద్రకళ గారిని అభినందించారు.

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
అభినందనలు మేడమ్ 👏👏👏💐💐💐🎊🎊🎊