TGRS తాండూరు బాలికల పాఠశాలలో ఘనంగా జాతీయ సైన్స్ డే వేడుకలు

 వికారాబాద్ జిల్లా తాండూరు లోని తెలంగాణ గురుకుల బాలికల పాఠశాలలో జాతీయ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు తయారు చేసిన సైన్స్ ఎగ్జిబిట్లను సందర్శించారు.
సైన్స్ ఉపాధ్యాయురాలు అనిత ఆధ్వర్యంలో విద్యార్థులు రూపొందించిన వివిధ శాస్త్రీయ నమూనాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధారిత ప్రాజెక్టులు అందరినీ ఆకట్టుకున్నాయి. విద్యార్థుల సృజనాత్మకత, పరిశోధనా దృక్పథం ప్రశంసనీయమని ప్రిన్సిపల్ ప్రవీణారెడ్డి తెలిపారు.ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ, “విద్యార్థులు చక్కగా సైన్స్ అండ్ టెక్నాలజీపై అవగాహన పెంపొందించుకొని విజ్ఞానవంతంగా ఎగ్జిబిట్లు తయారు చేశారు. వారికి మార్గదర్శకత్వం అందించిన సైన్స్ ఉపాధ్యాయులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను” అని పేర్కొన్నారు.కార్యక్రమం అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసి ప్రోత్సహించారు. ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
కామెంట్‌లు