తెలంగాణ రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రికెట్ జట్టుకు శ్రీ చైత్ర రెడ్డి ఎంపికయ్యారు.
పెద్దేముల్ మండలం గిర్మాపూర్ గ్రామ రైతు పటేల్ రాంరెడ్డి కూతురు శ్రీ చైతన్య రెడ్డి తాండూర్ లోని మల్లారెడ్డిపల్లి ప్రభుత్వ పాఠశాలలో 9 తరగతి చదువుతూ జనని క్రికెట్ అకాడమీలో గత మూడు సంవత్సరాలుగా శిక్షణ పొందుతుంది.
ఈ నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆఫ్ అండర్ 17 క్రికెట్ పోటీలకు వికారాబాద్ జిల్లా తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ, రంగారెడ్డి జిల్లా జట్టులో ఇటీవల జరిగిన క్రికెట్ పోటీలో ప్రతిభను కనబరిచి స్థానం సంపాదించింది. అనంతరం ఈనెల 19 నుండి 22 వరకు రంగారెడ్డి జిల్లా గుర్రం గూడా లోని జిఎన్ఆర్ గ్రౌండ్స్ లో జరిగిన ఎస్ జీ ఎఫ్
అండర్ 17 బాలికల క్రికెట్ తరఫున ఆడింది. సెమీఫైనల్ లో రంగారెడ్డి జిల్లా జట్టు వరంగల్ పై విజయం సాధించడంలో శ్రీ చైతన్య రెడ్డి కీలకపాత్ర పోషించింది. అలాగే ఫైనల్ లో రంగారెడ్డి జట్టు హైదరాబాద్ జట్టు పై ఘన విజయం సాధించడంలో శ్రీ చైత్ర రెడ్డి ఓపెనర్ బ్యాట్స్మెన్ గానే కాకుండా పీక్ ఓవర్స్ లో ఆఫ్ స్పిన్ తో రాణించి
తన ప్రతిభను చాటింది. ఈ నేపథ్యంలో ఆల్ రౌండర్ గా మంచి ప్రదర్శనతో జాతీయ స్థాయిలో క్రికెట్ పోటీల కు సిద్ధమైన రాష్ట్ర అండర్ 17 క్రికెట్ జట్టుకు శ్రీ చైతన్య రెడ్డి ఎంపికైంది. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా డిఈఓ సుసింధర్ రావు, జిల్లా స్కూల్ గేమ్ ఫెడరేషన్ సెక్రటరీ రామచంద్రుడు, రాష్ట్ర పీఈటి సంఘం అధ్యక్షుడు రాఘవరెడ్డి, జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, రవికుమార్ ,సాబెర్ తదితరులు గెలిచిన జిల్లా జట్టును అభినందించారు. సెమీఫైనల్ ఫైనల్ లో జట్టులో కీలక పాత్ర పోషించిన శ్రీ చైత్ర రెడ్డిని వారు అభినందించారు. రాష్ట్ర జట్టు నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న శ్రీ చైతన్య రెడ్డి జాతీయ జట్టుకు సైతం ఎంపిక కావాలని వారు ఆకాంక్షించారు. ఈనెల 29 నుండి చండీఘర్ లో జరిగే జాతీయ స్థాయి అండర్ 17 స్కూల్ గేమ్ ఫెడరేషన్ క్రికెట్ పోటీలలో రాష్ట్ర జట్టు తరఫున శ్రీ చైత్ర రెడ్డి పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీ చైత్ర రెడ్డి మాట్లాడుతూ తాను భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. రంగారెడ్డి జిల్లా జట్టు విజయానికి మార్గ నిర్దేశం కోసం కృషి చేసిన జిల్లా సెక్రెటరీ రామచంద్రుడు, పిడి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాఘవరెడ్డి తదితరులకు శ్రీ చైతన్య రెడ్డి రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి