శల్యపర్వం 2 ! : - అచ్యుతుని రాజ్యశ్రీ

 దుర్యోధనుడు ఒంటరిగా కూలబడ్డాడు సైన్యం యోధులు గతించారు బాణాల దెబ్బతో అలసి దుఃఖంతో ఉన్నవాడు కాళ్ళీడ్చుకుంటూ ద్వైపాయన సరస్సు దగ్గరకు వెళ్ళాడు గదా కింద పెట్టి ఏడుస్తూ అనుకున్నాడు నేను విదురుని మాటలు పెడచెవిని పెట్టాను ఎలాగైనా ప్రాణాలు దక్కించుకొని పగ తీర్చుకోవాలి అందుకే సరస్సులోకి దిగి జల స్తంభన విద్యా ద్వారా మడుగులో దాక్కున్నాడు సంజయుడు చెప్పటంతో దుర్యోధనుడు ఉన్న ప్రాంతానికి కృపాచార్య కృతవర్మ అశ్వద్ధామ వచ్చారు పెరికివాడిగా నీవు దాకోరాదు బయటికి రా అని అంటే దుర్యోధనుడు ఏడుస్తూ అన్నాడు నాకు ఇంకా ఓపిక లేదు మీరు ఈ రాత్రి విశ్రాంతి తీసుకోండి ఇక చేసేదేం లేక వారు పొదలలో దాక్కున్నారు కృష్ణుడితో కలిసి పాండవులు కౌరవ శిబిరానికి వెళ్లారు అక్కడ ఏడుస్తూ ఉన్నా స్త్రీలను ఓదార్చారు వారినందరినీ హస్తినకు చేర్చాడు దుర్యోధనుని స్త్రీలను యుయుత్సుడు తన ఇంట్లో ఉంచి కాపాడాడు పాండవులు దుర్యోధనుడి కోసం అంతా వెతికారు కానీ కౌరవ శిబిరంలో అతను కనిపించలేదు భీముడికి మాంసం తీసుకువస్తున్న బోయలు ద్వైపాయన సరస్సు వద్ద దుర్యోధన అశ్వద్ధామ మాటలు విని వచ్చి ధర్మరాజుకి చెప్పారు పాండవులు వెంటనే కృష్ణుడితో కలిసి ఆ సరస్సుకు వచ్చారు ధర్మరాజు పెద్దగా అన్నాడు దుర్యోధన పిరికివాడిలాగా మడుగులో దాకోకు మా తోటి వచ్చి యుద్ధం చేయి ఒకవేళ మేము ఓడితే నీవే తిరిగి రాజ్యాన్ని ఏలుకొందువుగాని పలకటంతో రోషం వచ్చి దుర్యోధనుడు బయటికి వచ్చి అన్నాడు సరే మీలో ఎవరు నాతో యుద్ధం చేస్తారో రండి వారిని యమపురికి పంపుతాను ఇప్పుడు కృష్ణుడు మనసులో బాధపడ్డాడు ధర్మరాజా నీవు నీ తమ్ము లు దుర్యోధనుడితో గెలవలేరు పైగా గదా యుద్ధంలో మహా నేర్పరి నీవు అనవసరంగా మాట తూలేవు అని అన్నాడు అప్పుడు భీముడు ముందుకు వచ్చి దుర్యోధనుడితో నిన్ను నా గధకు బలి ఇస్తాను అని అంటుండగా బలరాముడు అక్కడికి వచ్చాడు అతనికి దుర్యోధనుడు అంటే మహా ప్రీతి అందుకే గదా యుద్ధం చేయటానికి అనుమతి ఇచ్చాడు కానీ ఒక మాట అన్నాడు కురుక్షేత్రం ఉత్తమ ప్రదేశం అక్కడ యుద్ధం చేయటం మంచిది. ఎందుకంటే కురు అనే రాజు ఆ ప్రాంతాన్ని దున్నుతున్నాడు ఇంద్రుడు వచ్చినప్పుడు ప్రజలు స్వర్గానికి వెళ్ళాలి అనే భావంతో ఈ గురు ప్రాంతాన్ని దున్నుతున్నాను అన్నాడు దానికి ఇంద్రుడు పగలబడి నవ్వాడు ఎగతాళి చేశాడు అయినా గురు రాజు అక్కడ భూమిని దున్నటం మానలేదు అప్పుడు ఇంద్రుడు అతని కృషికి మెచ్చి ఓ కురు రాజా ఈ క్షేత్రంలో తిండి తిప్పలు మాని ప్రాణం పోతే వారికి పెద్దలు చేసిన వారికి చనిపోయిన వారికి సకల పాపములు నశిస్తాయి అని చెప్పడంతో పాండవులతో సహా దుర్యోధనుడు ఆ కు రు ప్రాంతానికి బయలుదేరాడు బలరాముడు నారదని వల్ల కురుక్షేత్ర యుద్ధం గురించి తెలుసుకుని తనైతేర్దయాత్ర ఆపి అక్కడికి వచ్చాడు ఇప్పుడు బలరాముని మాటలతో దుర్యోధనుడికి ధైర్యం వచ్చింది భీముడ డి తో గదా యుద్ధం మొదలుపెట్టాడు పోరు భీకరంగా సాగుతోంది కానీ భీముడు నిస్సహాయ స్థితిలో ఉండటం చూసి కృష్ణుడు అర్జునునితో అన్నాడు అర్జున దుర్యోధనుడి తొడలపై గత తో కొట్టి చంపకుంటే దుర్యోధనుడు చావడం మన కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు చేసింది వృధా అవుతుంది అని చెప్పడంత తో అర్జునుడు తన అరచేతితో తొడను చరచి భీముడికి సైగ చేశాడు దానితో భీముడు దుర్యోధనని రెండు తొడలు పచ్చడి అయ్యేలాగా చితకబాదాడు తన ఎడమ పాదంతో అతని తల మీద తన్నాడు సంతోషంతో ఆనందపడ్డారు కానీ బలరాముడు కోపంతో భీముడు అన్యాయంగా దుర్యోధనుడి తొడలపై చావబాదాడని నిరసించాడు కృష్ణుడు అన్నను సమాధానపరిచాడు అన్నా బలరామ పాండు పుత్రులు ధర్మపరులు నీతిమంతులు దుర్యోధనుడు ద్రౌపదిని జుట్టు పట్టుకుని ఏడిపించినాడు అప్పుడే అతని తొడలు అరుకుతానని భీముడు ప్రతినబోనాడు తన మాట నెరవేర్చుకున్నాడు కాబట్టి భీముడు చేసినది నేరము కాదు ఇక ఏమీ చేయలేక బలరాముడు రథం ఎక్కి ద్వారకకు వెళ్ళిపోయాడు🌹
కామెంట్‌లు