నా పంచపదుల సంఖ్య-----2205-2207.2205.అమ్మూ! పుస్తకపాణి!అక్షరం బ్రహ్మం, జ్ఞానప్రదము!పుస్తక పఠనం ,పూర్ణ ఏకాగ్రత,కలుగ చేయుము!చదువు ఇమ్ము ,విజ్ఞులం, చదవకున్న అజ్ఞానులము!పుస్తక పఠన ప్రయోజనం,జీవితము సార్థకము!షేక్స్పియర్ జన్మదినం,ప్రపంచ పుస్తక దినోత్సవం, పివిఎల్!2206.కదలకుండా ప్రపంచం చూసే, రాజమార్గము గ్రంథము!సమాజ హితం, సాహిత్యము, సాహిత్యం పుస్తక నిక్షిప్తము!నాడు తాళపత్ర గ్రంధాలు, నేడున్నది బహు రూపము!జనగ్రంథాలయం ,మౌనవిద్యాలయం,ఓ తపోవనము!మన ఇల్లు పుస్తకాలుంటే,విజ్ఞానానికి పుట్టినిల్లు, పివిఎల్!2207.పుస్తకాలు చదువుదాం,సమాజాన మంచి పెంచుదాము!పుస్తకాలెన్నో కొందాము, రచయితల్ని ప్రోత్సహిద్దాము!పఠనాభిలాష కోసం,పుస్తకాల కానుకలిద్దాము!జీవన నైపుణ్యాలు,నాలుగు పుస్తకమే సాధనము!చదువు మహాసాగరము,పఠనమే ఓడ ప్రయాణం, సివిల్!__________
పుస్తకం-సమస్తం.: - డా పివిఎల్ సుబ్బారావు, విజయనగరం 9441058797.
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి