మాయాబజార్ !- మానవత్వం బేజార్!: - డా పివిఎల్ సుబ్బారావు విజయనగరం 9441058797.
నా పంచపదుల సంఖ్య-----
     2209-2212.

2209.
 భిన్నప్రవృత్తులున్న,వ్యక్తుల, సమూహము సమాజము !

యువత మన సమాజ,
జనాభాలో అధిక శాతము!

ఆవేశం అనుకరణ ,
పరుగులెత్తు యువరక్తము! 

యువతనది, ఉప్పెనయితే,
సమాజాన ఉత్పాతము! 

నదీ జలాలు పంట పొలాల, మళ్ళితేనే సార్ధకము,
పివిఎల్!
2210.
సినిమా దృశ్యము యువ, మెదడు ఆకర్షణ తధ్యము!

ఓనాటి సినిమా వినోదం ,
సందేశం అందించే లక్ష్యము! 

నేడు ఆది-అంతము భీభత్సం, చిందించు రక్తపాతము! 

సంపన్నుల రాజ్యం, పెట్టుబడి, మార్గం ,రాబడి సూత్రము! 

సమాజ సంస్కరణ శూన్యం, 
ఖల్ నాయక్ ఆదర్శము,
పివిఎల్!
2211.
తమో, రజ గుణ వికాసం,
సత్త్వ గుణం బహుదూరము!

మనిషి ఉదాత్తుడు? 
ఉన్మత్తుడు సినిమా ప్రభావము!

మనిషి రెచ్చిపోతున్నాడు, కోల్పోయేది మానవత్వము! 

విజయం నేడున్న  ఫార్ములా
అదేగా లా, పోటీతత్వము!

సినిమా నటులు,
    ప్రజా నాయకులు ,
         జన పాలకులు,పివిఎల్!
2212.
సినిమా యు/ఎ, శాంతము, లుప్తము ,ఉన్నదంతా క్రౌర్యము!

మనం సినిమా చూడడం బాగుపడడం ఓ సందేహము! 

సినిమా తీసిన వాడు ,
చెడిపోడు అది వ్యాపారము! 

సినిమా కళ తగ్గి,
సాంకేతికత హెచ్చిన యుగము!

జగమే మాయ, సినిమా జనాల, వీడని మహామాయ ,పివిఎల్! 
_________


కామెంట్‌లు