కవిత్వం కడుపు పండింది.: - డా పివిఎల్ సుబ్బారావు, హైదరాబాద్,9441058797.
==========================================
ఏప్రియల్ 30 ,మహాకవి శ్రీశ్రీ  జయంతి శుభాకాంక్షలతో ...
============================================
   1.
భావశ్రీ భాషశ్రీ వెరసి శ్రీశ్రీ!

ఇంటిపేరు శ్రీరంగం,
 అంతరంగం కవితా కదనరంగం!

జనాల శ్రీనివాసరావు ,
కవితాశ్రీల మేలిప్రోవు!

శ్రీశ్రీ వ్యక్తి ఏకవచనం,
శక్తి బహువచనం!

అమేయ శబ్దశక్తి,
 పద ప్రయోగ యుక్తి! 

తరతరాలకు చెరగని ,
కవితా సూక్తి! 
2.
ఆధునిక తెలుగు కవిత,
 ఆకాశాన అస్తమించని రవి! 

వ్రాసిన కవితల ,
మెరుపు తగ్గని కోహినూర్ పవి!

అందించాడు కవితల, చెవులూరించే నవచవి!

నా మార్గం అనితర సాధ్యం, అన్న మహాకవి! 

భువి జీవన పద్మవ్యూహం
ఛేదించి ,కవితా దాహం సృష్టించి, చేరినాడు దివి!
3.
ఆధునిక తెనుగు కవితా, మహామాలా రత్నం!

కవిత్వ శ్రీ భాష్యం,
 శ్రీ శ్రీ మహాప్రస్థానం! 

పాఠకుల హృదయరత్న, సింహాసనాలపై విరాజమానం!

సినిమా పాట వ్రాసినా,
 పదముద్ర వినూత్నం!

మార్క్సిస్టు, కవిత్వానికి, మార్కులు వేస్తే ఆయనే ఫస్ట్!
4.
శ్రీ శ్రీ కవిత !

చెవిలో పడితే,
 ఉరకలేయు ఉత్సాహం! 

నోటితో పలికితే,
 మేల్కొలుపు భావోద్వేగం! 

మనసుపెట్టి చదివితే,
 ఆనంద రసావిష్కరణం! 

శ్రీశ్రీలా వ్రాయగలిగితే? 
కవితానుభూతినిష్ట పరాకాష్ట!
నీవే కాగలవు కవి శ్రేష్ట! 
5.
ఒక్కో ఆంధ్రుడు,
 కనీసం ఒక్క రూపాయి చాలు!

పరిగెత్తి వచ్చి తీరుతాయి,
 కోటి రూపాయలు!

ప్రతి ఏడాది శ్రీ శ్రీ జన్మదిన,
 కవితా పురస్కార్!

నిరూపిద్దాం మనలోని,
 ప్రతి ఒక్కరి సంస్కార్! 

అందిద్దాం ఆంధ్ర భాషా ,
కవితా ఆస్కార్!
________


కామెంట్‌లు