పంతులుత్రయంలో ఒకడుగా ప్రసిద్ధి పొంది స్త్రీ విద్య కొరకుపాటుపడి సహవిద్యా పాఠశాల ఆద్యుడైనాడు!!పాఠ్యపుస్తకాలు రచించి ఆచార్యుడైనాడు!!బాల్య వివాహాలు ఖండించివితంతు వివాహాలు ప్రోత్సహించినమహిళా జన రక్షకుడు!!సమాజంలో పట్టిపీడించే మూఢాచారాల బూజు దులిపిన సంఘసంస్కర్త!!అక్షరాలతో మమేకమైసాంఘికోద్యమ నేపధ్యం లోనవల,నాటకం ,కథలు జీవితచరిత్రలు, వ్యాసాలు,విమర్శఇలా ఎన్నో సాహిత్య ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన గద్యతిక్కన!!సామాన్యుడు అసమాన్యుడై క్షణక్షణం సమాజాహితం కోసం పరితపించిన ప్రజల మనిషి!!తెలుగు ప్రజల కోసం స్త్రీ అభ్యున్నతికి పరితపించి సాంఘికంగాసాహిత్యపరంగా ఎనలేని సేవ చేసిన వీరుడు,ధీరుడు,సంస్కారవంతుడు, రాణ్మహేంద్ర రారాజు వీరేశలింగం!!సమాజ హితాన్ని ఆశించి హితకారిణి సమాజ స్థాపకుడైవివేకవర్ధిని పత్రికను ఆయుధంగా చేసి సమాజంలోనికుళ్లును కడిగిఅవినీతిపరులకు సింహస్వప్నమైనాడు!!హాస్య సంజీవని పత్రికతో ప్రహసనాలకు ఆద్యుడయ్యాడు!సంఘసంస్కరణే ధ్యేయంగాసమాజాభివృద్ధే లక్ష్యంగామూఢాచారాల నడ్డి విరిచిన ఆంధ్రుల ఆరాధ్యుడుప్రజా చైతన్య దిక్సూచిఆంధ్ర సమున్నత శిఖరం యుగపురుషుడుకందుకూరి వీరేశలింగం!!......( కందుకూరి వీరేశలింగం గారి జయంతి సందర్బంగా..)------------------------
యుగపురుషుడు వీరేశలింగం..: - డా.చీదెళ్ళ సీతాలక్ష్మి-అసోసియేట్ ప్రొఫెసర్(విశ్రాంత)హైదరాబాద్-9490367383
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి