పరమాణువులో సూక్ష్మము
పరమార్ధంలో మోక్షం
ఏ రూపమైన నీవేగా అంశం తరుణీ..
నీవో అద్భుతం..
జీవనది పాయల్లా
తల్లిగ, చెల్లిగభార్యగ
బహురూపాలలో నీప్రేమేగ భామినీ...
నీవో అద్భుతం..
జగతికి శ్రీకారమై
మనుగడకు ఆలవాలమై
మమతల సుధలు కురిపించు మానినీ...
నీవో అద్భుతం...
జీవనపధంలో అడ్డంకులను
అధిగమిస్తూ సహనశీలిఅయి
అంతరిక్షమునకెగిసిన అతివ...
నేవో అద్భుతం...
అనితరసాధ్యం నీ వైనం
జనులను కలిపే బంధితసూత్రం
తరతరాలా సేతువు నీవే తన్వి...
నీవూ అద్భుతం...
ఒడినే బడిగా మలిచి
తొలిగురువై విద్యారంభంతో
భవితకు దారిచూపే దాక్షాయణి...
నీవో అద్భుతం...
సాగరాల లోతులు వెతికి
వినువీధిలో విజయ బావుట ఎగురవేసి
ఆశదీపాలు వెలింగించిన అమృతమూర్తి...
నీవో అద్భుతం...
విశ్వవీణను సవరించి
అనుబంధ సజీవరాగాలు
పలికించగల మేధావి
నీ స్థానం అద్వితీయం....
నీఆకృతి పూజ్యనీయం..
మహిళ ఓ. అద్భుతం: -భవాని తీగలపల్లి..- ఖమ్మం- తెలుగు భాషోపాధ్యాయిని -చరవాణి: 9490407572
• T. VEDANTA SURY
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి