చెడును చెడిపేద్దాం !: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977.
రండి రండి కలిసిరండి మీరంతా ఊరంతా
లెండి లెండి చెడును చెడుపుదాం మనమంతా
మనమందరం కలిసి చేతనైన దంతా చేద్దాం
ఇల చెడు జరగకుండా ఇకపై అంతా చూద్దాం !

ఇల కామంతో కైపెక్కిన కామాంధులు
ఇంతులపై పూబంతులపై దాడి చేస్తూ
వారి మానప్రాణాలను దోచేస్తున్నారు
మనం కనిపెడదాం ఈ లైంగిక దొంగల పని పడదాం !

మానవత్వాన్ని మంట కలిపిన
దానవత్వాన్ని ఇంట నిలిపిన
మానాన్ని దోచే మానవ మృగాలు ఉన్న గేహాలను
కూల్చేధ్ధాం పేల్చేద్దాం రండి రండి త్వర త్వరగా!

చెడు సహవాసాలను చేస్తున్న
పరుల సొమ్మును కాజేస్తున్న
పడుతుల మాన ప్రాణాలను దోచేస్తున్న
పడకటింటి  దొంగల కనిపెట్టి పని పడదాం!

అతివలు అబలలు కాదన్న సంగతి
ఈ జగతి ప్రగతికి వారేగా గతి అన్న
ఇంగిత జ్ఞానాన్ని కలిగిద్దాం అందరికీ
ప్రగతి పథంలో పయనిద్దాం  ముందరికి !


కామెంట్‌లు