దారి తప్పిన కవితక్క!: - గుర్రాల లక్ష్మారెడ్డి కవి రచయిత-సెల్.9491387977.
మీ అమ్మను నేను
అన్న ఈ కవితక్క
ఏ త్రాసు ముక్కనో
తెలుసుకో ఓ అక్క !

తన తండ్రి పార్టీని
తను కాపి కొట్టినట్టి
కవితమ్మ తలతిక్క
తెలుసుకో ఓ అక్క !

 నాన్నగారి మాటను
 ఆ అన్నగారి బాటను
 దాటేనుగా ఆ కవితక్క
  ఓటే ఇక లేదను అక్క !

నేనేలే  మీ అమ్మను
ఇస్తాలే ఇక సొమ్మును
అని చెప్పే ఈ కవితక్క
దారి తప్పేను ఓ అక్క !

తానే  సీఎం అంటూ
తను కలలేన్నో కంటూ
కవిత వేస్తుంది అడుగు
కని పట్టకక్కఏ గొడుగు !

మన యువతకు లోను
లక్ష నుండి కోటి వరకు
ఇది కవిత అక్క మాట
మీరు నమ్మొద్దు ఏ పూట !

ప్రజలకు ఇచ్చు నోట్లు
ప్రభలంగ వచ్చు ఓట్లు
అని కవితక్కతలెచెను
ప్రజల ముందు నిలచెను !


కామెంట్‌లు