వశిన్యాది వాగ్దేవతలు చెప్పిన అమ్మ నామాలలో.....
74. భండపుత్రవధోద్యుక్త బాలా విక్రమనందితా
(షోడశాక్షరీ)
75. మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా
(షోడశాక్షరీ)
డెబ్బై ఐదవ నామ మంత్రము -
ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః
విషంగుడు, విశుక్రుడు - అని భండాసురుని సోదరులు. వీరిద్దరిలో విషంగుడు, పరాభట్టారిక యొక్క మంత్రిణి అయిన శ్యామలాదేవి చేతిలో హతుడవటాన్ని చూసిన పరమేశ్వరి చాలా సంతోషించింది. ఈ శ్యామలాదేవియే, "రాజాశ్యామల". ఇలా రాజాశ్యామలాదేవి వలన విషంగుడు హతుడవటాన్ని చూసి సంతోషపడుతున్న శ్రీమాత ను చూచి వశిన్యాది వాగ్దేవతలు అమ్మను "మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితా" అని కీర్తించారు. అటువంటి శ్రీమహారాజ్నికి నమస్కారము.
మనకు ఇతిహాసాలలో కనిపించే రాక్షసులలో, మహిషాసురుడు, నరకాసురుడు, భండాసురుడు, రావణుడు, హిరణ్యకశిపుడు అతి ముఖ్యులు. వీరు సకల శాస్త్ర విద్యలలో, శస్త్రాస్త్ర నైపుణ్యం లో దేవతలకు సమమైన వారు. వీరు చూపిన రాజనీతి కూడా, ఎదుటి వారికి అనుసరింప తగినదే. కానీ, ఏమి లాభం. ఈ గొప్పతనమంతా, తమ అజ్నానంతో పోగొట్టుకున్నారు. ఐహిక సుఖాలకు బానిసలుగా మారిపోయారు. దేవ గంధర్వులతో సరితూగుతాము అనే మదము, గర్వంతో దేవతలకు శతృవులుగా మారి, రాక్షస ప్రవృత్తి చేత అసురులు అయ్యారు. అరిషడ్వర్గాలకూ లోబడి పోయారు. తమ ఉనికికే ఇబ్బంది తెచ్చుకున్నారు.
భండాసురుని కుమారులైన విషంగుడు, విశుక్రుడు కూడా తమ తండ్రి కంటే, ఏవిధంగానూ తక్కువ వారు కాదు. కానీ విషయలాలసకు, అరిషడ్వర్గాలకు లొంగిపోయి, వీరు కూడా రాక్షస ప్రవృత్తి చేత సాధుజనులను ఇక్కట్ల పాల్జేస్తూ.... జీవిస్తున్నారు. వీరిద్దరిలో, విషంగుడు, మితిమీరిన విషయలాలసత్వం కలిగిన వాడు. అజ్నానానికి అధిపతి వంటివాడు. ఇతనిని భండాసురుని సేన నుండి పూర్తిగా నిష్క్రమింపజేయడానికి, అజ్నానాన్ని, అరిషడ్వర్గాలను తొలగింప గలిగిన రాజాశ్యామలాదేవి అయిన "శ్యామలాదేవి" ని విషంగుని అంతం చేయమని పంపింది, అమ్మ.
అమ్మ కరుణా పూరిత చూపులు తనకు తోడుగా ఉండగా, విషంగుని అంతమొందిస్తుంది, మంత్రిణి అయిన శ్యామలాదేవి.
"విషంగుడు" అంటే మనలోనే ఉన్న విషయలాలసలే. అరిషడ్వర్గాలు అయిన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలను రెచ్చగొట్టి లేపే వాడు. వీడిని జయించి మనం అమ్మ దారిలోకి వెళ్ళాలంటే, రాజాశ్యామలాదేవిని శరణు వేడుకోవాలి, త్రికరణశుద్ధిగా.
ఏ సాధకుడు, త్రికరణశుద్ధమైన సాధనతో, తపనతో, తపస్సుతో, తన కరుణ కోసం వేడుకుంటాడో, వానిని వెంటనే అరిషడ్వర్గాలకూ, అజ్నానానికీ దూరంగా ఉంచడానికి సిద్ధంగా ఉన్న శ్రీమాత ను పూజించేటప్పుడు
ఓం మంత్రిణ్యంబా విరచిత విషంగ వధ తోషితాయై నమః అని జపించాలి.
శ్రీ పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం గారి శ్రీ లలితా సహస్ర నామావళి వ్యాఖ్యానము ఆధారంగా....
...... ఓం నమో వేజ్ఞ్కటేశాయ

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి