నవ సమాజం (మార్పు అనివార్యం): - అంకాల సోమయ్య -దేవరుప్పుల-జనగామ -9640748497
మనుషులు విలువను మరచిన మనుషులు ,సమాజాలు

విలాసవస్తువుల బట్టే విలువను ఆపాదిస్తున్న వస్తుప్రేమాభిలాషులు

ఒకవైపు పంచభక్ష్యపరమాన్నాలు
మరోవైపు ఆకలి కేకలు ఆర్తనాదాలు
 
ఆడంబరాలతో వృధాఅవుతున్న డబ్బుదస్కం
పేదలకు విదిల్చరైరి ఎంగిలి మెతుకులు 

ఆస్తి అంతస్తుల్లో పోటి పడుతున్న (అ) సభ్యసమాజం

రేపు మనం పోయిననాడు వెంటేమి తీసుకెళ్ళలేమని 
ఎప్పుడు తెలుసుకుంటారో 
ఈ(అ) జ్ఞానులు 

ధనం మూలం ఇదం జగత్ అని అంటుంటారు 
అన్యాయాన్ని న్యాయంగా నమ్మిస్తున్న 
న్యాయమూర్తులు 

మార్పుకై గొంతెత్తుతున్నాడు
 సామాజిక ఉద్యమకారుడు 
అతనో ఏకాకి 
రేపు సమూహికశక్తి

కాలమిచ్చే సమాధానానికై
వేచిచూస్తున్న నిస్సహాయులు

మార్పో నినాదమే
మన ఆలోచనల్లో ,మన ఆచరణలో వినూత్నత చోటుచేసుకున్ననాడు

ఈ భువనం సమతలం
అప్పుడే ఇల స్వర్గధామం
అప్పుడే ఏర్పడును సమసమాజం


కామెంట్‌లు