ముఖపుస్తకంలో
ఆత్మీయులు ఉంటారు
అంగతకులు ఉంటారు
ఆధునిక కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరగడం మూలంగా
సమాచార ప్రచార, ప్రసార విస్తృతికి కేంద్రబిందువైదీముఖపుస్తకం
మన వాణి బాణీకి ఫేస్ బుక్కే
ప్రధానవాహిక
ఎంతో మంది వర్థమాన తలపండిన కవులను నాకు పరిచయం చేసింది
నన్ను నేను దిద్దుకొనుటకు
అతిపెద్ద ప్లాట్ ఫామైనది
రహస్యవేగులు ఉంటారు సుమా
అనుభూతులను అన్ని బహిరంగ పరచడం అంతమంచిది కాదు
ఎవరికి వారు హద్ధులేర్పర్చుకోవడం
అత్యవసరం
ముక్కు మొఖం తెలియని వాడితో పరిచయంచేయాలంటే
ఆచితూచి అడుగేయాల్సిందే?
త్వరితగతిన ముఖపుస్తకం
నన్ను ప్రశంసల్లో ముంచెత్తుతోంది
కానీ
కత్తికి రెండు వైపులా పదునులా
ప్రమోదముంది ప్రమాదముంది
ఈ విచక్షణ మనం కల్గియుంటే
సర్వలకు శుభప్రదం, జయప్రదం
ఆన్లైన్ వేదికిది గూగుల్ సెర్చ్ ఇంజన్
నిన్ను గమనిస్తుంది
సంఘవిద్రోహులు కూడా పొంచియుంటారిచ్చట
పాలు నీళ్ళు వేరుచేయు హంసవు నీవు కావాలి
సోషల్ మీడియా అనేది మంచిచెడులు సమాహారం
అప్రమత్తతే శ్రీరామరక్షగా
ఫేస్బుక్ నీ ఉన్నతికో సింహద్వారం

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి