ఓఅమ్మానాన్న(అంతరంగం): - అంకాల సోమయ్య -దేవరుప్పుల -జనగామ -9640748497
మేము అమ్మానాన్నలం
 మా కుటుంబానికి 
మేమే మూలాధారం 

గుండె నిండా ఆవేదనున్నా
ఎంతో గుండె నిబ్బరం కలవాళ్ళం 
మేము ఎప్పుడూ బజారు నుండి ఇంటికొచ్చినా
ఒట్టి చేతులతో వచ్చేటోళ్ళంకాము
పండో ఫలమో
చాక్లెటో బిస్కెటో తెచ్చేటోళ్ళం
చిరుతిళ్ళు తిని 
తిండి తినట్లేదు పోరగాళ్ళు
పైసలు దండుగ అనిపించేది
బిస్కెట్లు చాక్లెట్లు 
పండుఫలాలు ఎదిగే పిల్లలకే కావాలి 
పిల్లల చిన్న చిన్న కోరికలు తీర్చలేకపోతే ఎలా అని అనుకునేటోళ్ళం

తన చుట్టూ ఉన్న స్నేహితుల
తల్లిదండ్రులతో మమ్మల్ని పిల్లలు పోల్చుకుంటారు
ఆ అవకాశం మనం మన పిల్లలకు ఇవ్వొద్ధు అని అనుకునేటోళ్ళం

పసి వయసు తెలియనితనం 
మాకెంతో ముద్ధు అనిపించేది 
ఈ వయసులోనే ఎటువంటి
 అరమరికలు లేకుండా సంతోషంగా గడుపుతారు
రేపు వీరు పెద్ద చదువులు చదివి 
ఉద్యోగాలు చేయోచ్చు 
ఊర్లేలనూవచ్చు

సామాజిక కార్యకర్తలు కావొచ్చు 
వారేమైనా మాకు అభ్యంతరం లేదు 
మా అమ్మ నాన్న 
మాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నారు
అనే మాటొక్కటి చాలు 
మా జన్మాంతం మా బిడ్డలకు
ఊడిగం చేయడానికి... !?

రేపు మేము ఉన్నా పోయినా 
బిడ్డలకు బ్రతికేంత భరోసానిచ్చాము
బీరులుగా కాదు ధీరులుగా బ్రతికేలా తర్ఫీదు నిచ్చాము 
మేము పరమకర్కోటకులుగా కాక
ప్రాణ స్నేహితులవలె ఎటువంటి
 భేషజం లేకుండా భుజంతట్టి ప్రోత్సాహిస్తుంటాము
మా నాన్నే మా కథానాయకుడు
మా అమ్మే మా కథానాయిక 
అని
చుట్టుపక్కల సమాజానికి 
మా జీవితం ఒక పాఠమై
వారి బ్రతుకులను వెలిగించాలి 
అలా కానినాడు
మేము తల్లిదండ్రులుగా 
బ్రతికున్నా చచ్చిన శవాలమే... 
మా నాన్నే మా రోల్ మోడల్ 
మా అమ్మే ఒక మార్గదర్శి
అని వేనోళ్ళ పొగడాలి


కామెంట్‌లు