“ఏమిటీ సడన్‌గా ఊడి పడ్డావు? ఇంట్లో ఎవరు లేరా?” అని ఆశ్చర్యంగా అడిగాడు మాధవ్.
“అందరూ ఉన్నారు. అందుకే ఈజీగా తప్పించుకుని రావడానికి వీలైంది బావా!” అని ఊపిరి సలపకుండా చెప్పింది రాధ.
“ఓహో! మరి ఇంతగా ఆయాసపడుతూ పరుగెత్తుకుంటూ రావాల్సిన పని ఏమిటి?” అని సందేహంగా అడిగాడు.
“అదేమిటీ బావా! నిజంగానే నువ్వు చాలా అమాయకుడివి. ఆ మాత్రం కూడా అర్థం కాలేదా?” అని రాధ బాధ పడుతూ అన్నది.
“ఎందుకు తెలియదు? నువ్వు నన్ను ఏప్రిల్ ఫూల్ చేయడానికి వచ్చావు. అంతే కదా!” అని మాధవ్ నవ్వుతూ అన్నాడు.
“అయ్యో బావా! బయట పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో నీకు తెలియదు. మా ఇంట్లో చుట్టాలు అందరూ వచ్చారు. నాకు పెళ్లి చూపులు చూస్తున్నారు. నాకు తెలియకుండా ఏర్పాటు చేశారు. అందుకే భయపడి నీ దగ్గరకు పరుగెత్తుకుంటూ వచ్చాను. ఇప్పుడేమి చేయాలి? నువ్వు వెంటనే మా ఇంటికి వచ్చి ఆపాలి. త్వరగా రా!” అని ఆందోళనగా చెప్పింది రాధ.
“సరే, పద!” అని అన్నాడు మాధవ్. కానీ ఒక్క క్షణం ఆగి తన ఫోన్ తీసుకున్నాడు.
“హలో స్వాతి! నేను రెడీ అయ్యే సరికి మా మరదలు హడావిడిగా వచ్చేసింది. వాళ్లింట్లో ఆమెకు పెళ్లి చూపులు చూస్తున్నారట. అది ఆపేసి అక్కడి నుంచి నేరుగా వస్తాను. నువ్వు థియేటర్‌కి డైరెక్ట్‌గా కారులో వచ్చేయ్. వెళ్తేప్పుడు మనం ఆటోలో వెళ్దాం. ఆహా, మర్చిపోయా… మల్లెపూలు నేను తీసుకొస్తాను. డోంట్ వర్రీ!” అని చెప్పి ఫోన్ పెట్టేశాడు.
“సరే రా, బైక్ ఎక్కు,” అన్నాడు మాధవ్.
అయితే రాధ కదలలేదు. ఆమె కళ్లలో నీళ్లు మెదిలాయి.
“ఏమైంది? ఎందుకు ఇలా చూస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు రాధా?” అని ఆశ్చర్యపోయాడు మాధవ్.
“ఇదేంటి బావా! జోక్స్‌కైనా ఒక హద్దు ఉండాలి. నేను ఇంత సీరియస్ పరిస్థితిలో నీ దగ్గరకు వస్తే స్వాతి, సినిమా థియేటర్ అంటూ నువ్వేమిటి ఇలా మాట్లాడుతున్నావు…” అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ బాధగా, ఏడుస్తూ అంటూన్న రాధ వైపు
చూసి మాధవ్ సీరియస్ అయ్యాడు.
ఆమెను ఓదార్చి వెంటనే ఆమెతో కలిసి ఇంటి వైపు బయలుదేరాడు.
ఇంటికి చేరుకున్నాక వింతగా అనిపించింది. బయట ఎలాంటి హడావిడి లేదు. పెళ్లి చూపుల సందడి ఎక్కడా కనిపించలేదు. ఇల్లు నిశ్శబ్దంగా ఉంది. కానీ లోపల నుంచి చిన్నగా నవ్వులు, గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాధ చేయి పట్టుకుని మెల్లగా లోపలికి అడుగు పెట్టాడు మాధవ్.అక్కడ చూసింది మాత్రం అతడిని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఇల్లు అంతా పూలతో అందంగా అలంకరించబడి ఉంది!
“ఏమిటీ ఇదంతా?” అని గట్టిగా అడగబోతూ పైకి చూసాడు.
అక్కడ ఒక బ్యానర్ కనిపించింది—
“బావగారికి ఏప్రిల్ ఫూల్!”
అంతే…
ఒక్కసారిగా అందరూ బయటికి వచ్చి, “ఏప్రిల్ ఫూల్ బావా!” అంటూ చప్పట్లు కొడుతూ మాధవ్ మీద పూలు చల్లారు.
“బావను ఈరోజు ఎలాగైనా ఏప్రిల్ ఫూల్ చేస్తాను అని మాతో ఛాలెంజ్ చేసింది మా రాధ. ప్లీజ్ ఏమనుకోకండి!” అని నవ్వుతూ చెప్పారు అందరూ.
మాధవ్ కాసేపు షాక్ అయ్యాడు… తర్వాత రాధవైపు నువ్వు దేనికైనా తగుదువు అన్నట్లు చూస్తూ నవ్వును ఆపుకోలేకపోయాడు.
ఆ వాతావరణం మొత్తం ఆనందంతో నిండిపోయింది.అందరూ సంతోషంతో పార్టీ చేసుకున్నారు బావ మాధవ్ తో కలిసి.
వచ్చిన నవ్వును ఆపుకోకండి…మీరు కూడా 😂

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి