ఊషన్నపల్లి పాఠశాలకు రూ.9 వేల సామగ్రి వితరణ
 --గ్రామ సర్పంచి రేకుల జ్యోతి చేతుల మీదుగా కుర్చీలు, గోడ గడియారాలు, అద్దాలు అందజేత
 పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం ఊషన్నపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు కాల్వశ్రీరాంపూర్ గ్రామానికి చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు కేతిపల్లి మహేందర్ రెడ్డి 8 ప్లాస్టిక్ కుర్చీలు, అదే గ్రామానికి చెందిన విశ్రాంత పీజిహెచ్ఎం నార్ల వెంకయ్య 4 గోడ గడియారాలు,  ఉపాధ్యాయుడు కరుణాకర్ 6 అద్దాలను  పంపించగా, గ్రామ సర్పంచ్ రేకుల జ్యోతి రఘు  బుధవారం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్యకు అందజేశారు. ఇటీవల నూతనంగా నిర్మితమైన పాఠశాల భవనాల్లో కుర్చీలు, గోడ గడియారాలు, అద్దాలను అమర్చుటకు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య వారి సహకారం కోరగా, వారు వెంటనే స్పందించి రూ. 9 వేల విలువైన ప్లాస్టిక్ కుర్చీలు, గోడ గడియారాలు, అద్దాలను పంపించారు. ఈ సందర్భంగా ఈర్ల సమ్మయ్య మాట్లాడుతూ  గోడ గడియారాలు, అద్దాలు చక్కటి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ (టిఎల్ఎం) అని  అన్నారు. గోడ గడియారాలతో సమయాన్ని చూసుకోవడమే కాకుండా ఎలా తెలుసుకోవాలో పిల్లలకు నేర్పిస్తామన్నారు. పిల్లలు అద్దాల్లో చూస్తూ మాట్లాడడం, అభినయించడం ప్రాక్టీస్ చేస్తారన్నారు. మిర్రర్ ఇమేజ్ ని అద్దంలో చూసి అవగాహన చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నారు. పిల్లల సౌకర్యం కోసం పాఠశాలకు ప్లాస్టిక్ కుర్చీలు, గోడ గడియారాలు, అద్దాలను అందజేసిన దాతలకు ఆయన ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ సర్పంచి రేకుల జ్యోతిరఘు, నాయకులు ముస్కు మధుకర్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఈర్ల సమ్మయ్య, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు అమృత సురేష్ కుమార్, మంద శ్రీవాణి, ఎడ్ల స్రవంతి, గోపిశెట్టి సుప్రియ, పిల్లల తల్లిదండ్రులు కొమ్ము నరేష్, ముస్కు సంపత్, కుమారస్వామి, మొత్కూరి మానస, కొమురయ్య, పిల్లలు, పలువురు పాల్గొన్నారు.

కామెంట్‌లు