మామిడి పండు : -డా.. కందేపి రాణీప్రసాద్
మామిడి పండు నాకిష్టం
నేను తింటా అమ్మా
నేను తింటా!

పుచ్చకాయ నాకిష్టం
నేను జ్యూస్ తాగుతా
అమ్మా నేను తాగుతా!

అరటి కాయ నాకిష్టం
నేను మెత్తగా తింటా
అమ్మా నేను తింటా!

కమలాకాయ నాకిష్టం
నేను ఒలిచి తింటా
అమ్మా నేను తింటా!

దానిమ్మ కాయ నాకిష్టం
నేను గింజలు తింటా
అమ్మా నేను తింటా!

సపోటా నాకిష్టం లేదు
అబ్బబ్బ జిగట తినలేను
అమ్మ నాకొద్దు

మేడి పండు నాకిష్టం లేదు
అబ్బబ్బ పురుగులు తినలేను
అమ్మా నాకొద్దు!

సీతాఫలం నాకిష్టం లేదు
అబ్బబ్బ అన్ని గింజలు తినలేను
అమ్మా నాకొద్దు!

పండ్లన్నీ తినాలి పాపా
ఒంటికి మంచిది బాబూ
ఆరోగ్యానికి అన్నీ తినాలి!
పండ్లన్నీ తినాలి పిల్లలూ

కామెంట్‌లు