ఎంత ఎత్తుకు ఎదిగినా ఒదిగి ఉండాలని
ఎప్పుడు చిరు మందహాసంతో
ఎవరినైనా సాహితీ సభలలో ఆప్యాయంగా పలుకరించే
సాహితీ ద్రష్ట డాక్టర్ ఎల్ ఆర్ స్వామి గారు
ఎనిమిది పదులు దాటిన వయస్సులో కూడా
సాహిత్యమే ఊపిరిగా జీవిస్తున్న అక్షర ప్రేమికులు
విశాఖపట్నంలో ఆయన అధ్యక్షత వహించిన సరస్వతీ సభలేదు
ఆయన జన్మతః మలయాళీ
మాతృభాష తమిళం
ఉద్యోగరీత్యా విశాఖపట్నం
తెలుగు వారి అల్లుడు
మలయాళం నుంచి తెలుగు
తెలుగునుంచి మలయాళం లోకి అనేక రచనలను అనువాదం చేసిన పుంభావ సరస్వతి
సూఫీ చెప్పిన కథ గ్రంధానికి
అనువాద సాహిత్య కేంద్ర అకాడమీ పురస్కారాన్ని పొంది తెలుగు వారి కీర్తిని వ్యాపింపచేసిన పుణ్యమూర్తి
ఉద్యోగంలో చేరినపుడు మిత్రుల సవాల్ ను తీసుకు
తెలుగు నేర్చుకుని అనేక ప్రక్రియలతో రచనలు చేసి
పురస్కారాలు పొంది
కృషితో నాస్తి దుర్భిక్షం అన్న దానికి ప్రతీకగా
ప్రముఖ సహృదయ సాహితీ ,మొజాయిక్ లిటరరీ ఆర్గనైజేషన్ అధ్యక్షునిగా
ఎందరికో ప్రేరణ కలిగించిన అక్షరప్రేమికుడు
గోదావరీ స్టేషన్ ,సామెతల మినీకథలు,కథా స్వామీయం ,
కేరళ జానపద పాటలు అలగ, అలగ కథలు ఎన్నో ఎన్నెన్నో రచనలు చేసిన ప్రతిభాశాలి.
నేను వ్రాసిన' ప్రాణం తీసిన ఎన్నికలు కథను ఉత్తమ కథగా స్వీకరించి
వారు తాము వ్రాసిన పుస్తకాన్ని బహుమతి గా అందించి ఆశీర్వదించి
నా సాహితీ రచనా ప్రక్రియను ప్రోత్సహించారు
ఎనిమిది పదుల దాటిన వయస్సులో అందని తీరాలకు దరిచేరినా
జాతస్యహి ధృవో మృత్యు: అని తెలిసి కొని
వారికి నేనందిస్తున్న అక్షర నివాళి.....!!
( ఈ రోజు శ్రీరామచంద్రుని దరి చేరిన సాహతీ వేత్త డాక్టర్ ఎల్. ఆర్ స్వామి గారికి అశ్రునయనాలతో
..............................
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి