భీష్మ పర్వము ద్వితీయాశ్వాసము241 వ రోజు
రెండవ రోజు యుద్ధం
మరునాటి ఉదయాన పాండవ సైన్యం నూతనోత్సాహంతో సిద్ధం అయింది. క్రౌంచ వ్యూహాన్ని పరిశీలించడానికి ధర్మరాజు బయలు దేరాడు. అర్జునుడు తన గాండీవంతో కపిధ్వజంతో చేరి క్రౌంచ వ్యూహం ముక్కు భాగంలో నిలిచాడు. కుంతిభోజుడు, శైభ్యుడు క్రౌంచ పక్షి నేత్ర స్థానంలో నిలిచాడు. ద్రుపదుడు క్రౌంచ పక్షి శిఖలా నిలిచాడు. దశార్ణ, శూరసేన, కిరాత దేశాధీశులు క్రౌంచ పక్షి కంథాకారంలో నిలిచారు. భీమసేనుడు దృష్టద్యుమ్నుడు క్రౌంచ పక్షి రక్కల స్థానంలో నిలిచారు. అభిమన్యుడు, పౌంఢ్రుడు, ఉపపాడవులు, చోళులు, పాండ్యులు భీమ సేనుని పక్కన నిలువగా నకుల సహదేవులు, ఘటోత్కచుడు, శంబరులు, వత్సరాజులు ధృష్టద్యుమ్నుని పక్క నిలిచారు. కేకయ, కాశీ రాజులతో కూడి విరాటరాజు క్రౌంచ పక్షి జఘన భాగాన నిలిచారు. హోణపతి మొదలైన ప్రముఖులు చుట్టూ ఉండగా ధర్మరాజు క్రౌంపక్షి వెన్ను భాగంలో నిలిచాడు. కౌరవ పక్షాన సుయోధనుడు " మీరు ఒక్కొకరు పాండవ బలాన్ని గెలువగల సమర్ధులు మీరంతా ఒక చోట ఉన్న మిమ్ము గెలువ సాక్షాత్తు పరమేశ్వరునికైనా సాధ్యం కాదు. కాని పాండవ సైన్యం క్రౌంచ పక్షి రూపంలో నిలిచినందున మనం అందుకు దీటైన వ్యూహం పన్నడం ఎంతో అవసరం " అన్నాడు. సుయోధనుని మాట మేరకు కౌరవ సేన భీష్ముని ఆధ్వర్యంలో ప్రతి వ్యూహంలో నిలిచారు. దుశ్శాసన, వికర్ణ, విందాను విందులు, శూరసేనుడు, త్రిగర్త రాజులు ఒక పక్క నిలువగా ద్రోణ, కుంతల, దశార్ణ, విదర్భ దేశాధీశులు, గాంధార, సింధు, సౌవీర రాజులు ఒక పక్క నిలిచారు. భీష్ముడు మహా సైన్యంతో నడుమ భాగంలో నిలిచాడు. కృతవర్మ, శల్యుడు, అశ్మంత , కాశ్మీర రాజులు , కొంత మంది సుయోధనుని తమ్ములు సుయోధనుడు భీష్ముని వెనుక నిలిచారు.
రెండవ రోజు యుద్ధారంభం
దుర్యోధనుడు సజ్ఞ చేసి యుద్ధం ఆరంభించగానే కౌరవ సైన్యం పాండవ సైన్యంలోకి చొచ్చుకుని వెళ్ళింది. భీష్ముడు క్రౌంచ వ్యూహాన్ని చీల్చి చెండాడాడు. రెక్కలు చించాడు. కంఠమును త్రుంచి, తల పగుల కొట్టి క్రౌంచ వ్యూహాన్ని కకావికలు చేసాడు. అంతటా తానై విజృంభించాడు. అది చూసిన అర్జునుడు శ్రీ కృష్ణుని చూసి " బావా ! భీష్ముడు మన సేనలను చిందరవందర చేస్తున్నాడు. అయినా నా వైపు రావడంలేదు అతడి పొగరు అణచాలి రథాన్ని అతని వైపు పోనిమ్ము " అన్నాడు. శ్రీ కృష్ణుడు " అర్జునా ! అలాగే చేస్తాను. నా మాట కొంతవిను . కంగారు పడక నీ పరాక్రమంతో భీష్ముని సామర్ధ్యంగా ఎదిరించి శల్యాది కౌరవ ప్రముఖుల మనసును భయంతో నింపు " అన్నాడు. అర్జునుడు అడ్డు వచ్చిన శూరసేనుడి సైన్యాలను చిందరదర చేస్తూ భీష్ముని మీదకు భీకరంగా వచ్చాడు. ఇది చూసిన భీష్ముడు అర్జునుని డెబ్బై ఏడు కౄర బాణాలతో కొట్టాడు. ద్రోణుడు ఇరవై అయిదు బాణాలతోను, కృపాచార్యుడు అయిదు వందల బాణాలతోను, వికర్ణుడు మూడు బాణాలతోను, దుర్యోధనుడు అరవై నాలుగు బాణాలతోను, శల్యుడు తొమ్మిది బాణాలతోను అర్జునిని పై లంఘించాడు. శర వర్షాన్ని చూసిన అర్జునుడు కొండవలె స్థిరంగా నిలిచాడు. అర్జునుడు ఇరవై బాణములతో భీష్ముని, అరవై బాణాలతో ద్రోణుని, తొమ్మిది బాణాలతో కృపుని, వికర్ణుని, శల్యుని తలా మూడు బాణాలతో , దుర్యోధనుని అయిదు క్రూర బాణాలతో ఎదిరించాడు. ఆ సమయంలో సాత్యకి, ధృష్టద్యుమ్నుడు,
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి