రచనలపై యువత ఆకర్షితులు కావాలి!
 [తిరుపతి వేమన విజ్ఞాన కేంద్రం, సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో యువ రచయితలకు కార్యశాల]
 
 నేటి సాంకేతిక ప్రపంచంలో సోషల్ మీడియా ముసుగులో పడకుండా సాహిత్యం పట్ల అభిరుచిని, ఆసక్తిని పెంచే దిశగా యువ రచయితలకు ఒకరోజు కార్యశాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర విద్యాలయం, ప్రాచ్య పరిశోధన సంస్థ సౌజన్యంతో వేమన విజ్ఞాన కేంద్రం సాహితీ స్రవంతి నిర్వహణలో శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలోని సైకాలజీ సెమినార్ హాల్లో యువ రచయితలకు కథ, కవిత్వం పై 28/04/2026 న శిక్షణ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమానికి స్వాగత ఉపన్యాసం,కార్యశాల ఆవశ్యకత గురించి మల్లారపు నాగార్జున వివరించారు. ముఖ్య అతిథులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు విభాగాధిపతి రాజేశ్వరమ్మ, ప్రాచ్య పరిశోధన సంస్థ సంచాలకులు పి.సి. వెంకటేశ్వర్లు, ఓ వెంకటరమణ పాల్గొని నేటి సమాజంలో కథలు, కవిత్వం ఏ దిశగా సాగుతుంది, ఎలాంటి రచనలు చేయాలి, ప్రాచీన కాలానికి, ఆధునిక కాలానికి మధ్య ఉన్న తారతమ్యం ,అభివ్యక్తీకరణ, ఆలోచనలో మార్పులు వంటివి వివరించారు.
అనంతరం ఆర్ ఎం ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాలు, మన కుటుంబం గ్రామీణ నేపథ్యం సమాజంలో జరుగుతున్న సంఘటనలే ఇది వృత్తాలుగా కథల వస్తువులుగా తీసుకొని కథా రచనలు చేయడం సహజ కథలుగా చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలిపారు.
ప్రముఖ కథా రచయిత కృష్ణ స్వామి రాజు మాట్లాడుతూ నా నిజ జీవితంలో జరిగిన సంఘటనే కథా వస్తువుగా తీసుకొని రాయాలన్నారు. చిన్న నాటి నుండి కథలపై మక్కువతో కథలు రాయడం మొదలు పెట్టానని నేటి యువత కూడా మన చుట్టూ ఉన్న అంశాలను కథా వస్తువులుగా తీసుకొని రాయాల్సిన అవసరాన్ని గుర్తించారు.
ప్రముఖ కథ,నవలా రచయిత మధురాంతకం నరేంద్ర మాట్లాడుతూ ఆధునిక సాహిత్యంలో ఎన్నో కథలకు ప్రారంభం, ముగింపు ఒకేలాగా ఉన్న కొన్ని కథలకు ముగింపు ప్రారంభం లాగా కథా రచయితలు కథా వస్తువుని తీసుకోవడం వైవిధ్యంగా ఉంటాయని, అటువంటి కథలు పది కాలాలపాటు చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఉంటాయంటూ నేటి యువత ఆదిశగా ముందుకు సాగుతూ వినూత్న కథనా శైలిలో కథలు రాయాలని ఆశించారు.
అనంతరం సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి కెంగార మోహన్ మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి వివిధ పరిణామాల్ని కథా వస్తువులుగా తీసుకొని నేటి యువత రచనల వైపు సాగాల్సిన అవసరం ఎంతైనా ఉందని సెల్ ఫోన్ మోజులో పుస్తక పఠనాన్ని దూరం చేసుకోవడం మంచిది కాదని, నేటి యువత ఆ దిశగా ముందుకు సాగాలని తెలిపారు.
మొత్తం 60 మంది యువ రచయితలు నమోదు చేసుకుని హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాహితీ స్రవంతి ప్రతినిధులు సాయి లక్ష్మి, వేమన విజ్ఞాన కేంద్రం ప్రతినిధులు నడ్డి నారాయణ, రచయితలు మన్నవ గంగాధర ప్రసాద్, నెమిలేటి కిట్టన్న , పేరూరు బాలసుబ్రమణ్యం, యువశ్రీ మురళి, పత్తిపాటి రమేష్ నాయుడు, తాతయ్య,సురేంద్ర రొడ్డా, నెల్లూరు మునిలక్ష్మి, మహేష్ బాబు,గుత్తా హరి సర్వోత్తమనాయుడు,జయపాల్, షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు