సామెతల ఊట- సునందమ్మ నోట: -వురిమళ్ల (భోగోజు) సునందా ఉపేందర్ రావు ఖమ్మం

 సామెత -206: -  ఆవలింతకు అన్న ఉన్నడు గని తుమ్ముకు తమ్ముడు లేడు
****
"ఒరేయ్ బుడ్డోడా! పరీచ్చలు అయితున్నయి సద్వురా అంటే వయ్యి ముందేసుకుని ఏం జేత్తున్నవ్ రా?"
అవ్వా! అవ్వా ! బుడ్డోడు  సద్వకుండా కళ్ళు మూసుకుని సద్వినట్టు యాచ్చన్ చేత్తుండు. నేను జూడు తమాశిగ సద్వుకుంటున్న.
గీ బుడ్డోడికి గీ నడ్మల సద్వు మీంచి మన్సు మల్లింది.బాగ ఆటలకి మరిగిండు.గిప్పుడు కూసోని సద్వమంటే వొల్లెట్ల అని సొంపుద్ది. కాల్జేతులు కడుక్కొని సద్వరా! అంటే వొల్లంత శిటశిట అంటుంది తానం జేత్త అన్నడు. ఇంగేముంది తానం జేసి కూసోని సద్వకుండ కూర్పట్ల బడుతున్నడు.ఒరేయ్! బుడ్డోడా! గిట్లనే నువ్వు సద్వకుండ కూసుంటే  జాంబెడు నీళ్ళు తెచ్చి నెత్తిమీద పోత్తరా! లేశి జాలట్లకెళ్ళి గాబుల నీళ్ళతో కండ్లు కడుగుతవా! నీళ్ళు పొయ్యమంటవా!"
"వొద్దులేవే అమ్మా! నేను లేపుత తీ! పసోడు, గీని సద్వు గురించి రంది జెయ్యకే".
 నీకు తెల్వదు అవ్వా! గాన్ని గార్వంజేసి నువ్వే శెడగొడ్తున్నవ్. అగ్గో సూశినవా! లేశి ఆవలిత్తున్నడు.గిప్పటి దాక సద్విందల్ల  బుడ్డోడ్ని జూసి  ఎట్ల ఆవులిత్తుందో సూడు. ఆడు ,ఆని ఎనక ఇది పోటీలు పెట్కొని ఆవులిత్తున్నట్టుంది."
 "గందుకే అంటరే కోడలా!"ఆవులింతకి అన్నున్నడు గని తుమ్ముకు తమ్ముడు లేడని " అగ్గో గాళ్ళని తిట్టుకుంటనే నువ్వు సుత ఆవులిత్తున్నవు.గిదే సాచ్చం మరి.
"అవునవ్వా యతార్తం శెప్పినవ్. పొద్దటి సంధి మీ కొడుకు పడిశం బట్టి ఒక్కటే తుమ్ముడు.ఎవ్వరు సుత గాయనతో పాటు తుమ్మనే లేదు.
 గిట్ల ఆవులింతలు ఒకదానికొకటి సాయం జేసుకుంటయి. తుమ్ములు ఎప్పుడూ ఒంటరియే.
"అవ్వా భలే శెప్పినవ్! తమ్ముడు ఆవులిత్తుంటే నాకు సుత వొచ్చినయ్! నాయిన పొద్దుగాల నుంచి ఒక్క తీర్గ తుమ్మతుంటే  ఇంట్లె ఒక్కలికీ రాలే!"
అవునే భూలచ్మీ! ఒకలికొకలు మీయిద్దరొదికె ఆవులింతలు.ఎవురి కట్టం వారిదే అని చెప్తుంది తుమ్ము.
గదండీ సంగతి! "ఆవలింతకు అన్న ఉన్నడు గని తుమ్ముకు తమ్ముడు లేడు అంటే గిదే మరి.
కామెంట్‌లు