సంపూర్ణ మహాభారతముసరళ వ్యావహారిక భాషలో...!
 భీష్మ పర్వము ప్రథమాశ్వాసము-232 వ రోజు
(పాఠకులకు ఒక్క మనవి: ఇక్కడి నుండి భగవద్గీత ప్రారంభం అవు తుంది. భగవద్గీత్త విషయంలో కొంత మందికి కొన్ని అపోహలు. ఉన్నాయి.)
(1) భగవద్గీత మహాభారతంలో అంతర్భాగమా లేక వ్యాసుడు విడిగా, రాసాడా?"
మనకు నాలుగు వేదాలు ఉన్నాయి. ఋగ్వేదము, యజుర్వేదము, ' సామవేదము, అధర్వణ వేదము. ( కొంతమంది మూడు వేదములు అని- కూడా అంటారు.) ఈ వేదములలో చెప్పబడిన రాజుల కధలు, దేవతల కధలు, యజ్ఞయాగాది క్రతువులు, రాజనీతి విషయాలు, నీతి విషయాలు, యుద్ధరీతులు, అనుసరించవలసిన వ్యూహములు, ఇత్యాది విషయములు అన్ని మహాభారతములో మనకు కనపడతాయి.
వేదాంగములు అయిన ఉపనిషత్తులలో ఉన్న విషయములు అన్నియు, క్రోడీకరించి, సరళమైన భాషలో అందరికీ అర్థమయ్యే రీతిలో భగవద్గీతరూపంలో 18 అధ్యాయములలో పొందుపరిచాడు వ్యాసభగవానుడు. అందుకే మహా భారతమును పంచమ వేదము అన్నారు. మహాభారతము 18 పర్వములయితే, భగవద్గీత 18
అధ్యాయాలు, యుద్ధముకూడా 18 రోజులు జరిగింది. ఒకటికి ఒకటి
అనుసంధానమయి, ఉన్నాయి. కాబట్టి భగవద్గీత మహాభారతములో
అంతర్భాగము అన్న విషయంలో ఏ మాత్రం సందేహం లేదు.
2. ఇరుపక్షముల సైన్యములు మోహరించి యుద్ధము చెయ్య డానికి కదను తొక్కుతుంటే, ఇరుసైన్యముల మధ్య నిలబడి, కృష్ణుడు తీరుబడిగా, 700 శ్లోకములు అర్జునుడికి చెప్పాడా!
ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే వ్యాసుడు సందర్భము వచ్చినప్పుడల్లా నీతి శాస్త్రము ఏదో ఒక పాత్ర చేత మనకు బోధించాడు. నారదుడు ధర్మరాజుకు రాజనీతి బోధించాడు. విదురుడు ధృతరాష్ట్రునకు నీతిసూత్రాలు బోధించాడు. ద్రౌపది సత్యభామకు పతివ్రతా లక్షణాలు వివరించింది. మనం చదువుకున్నాము. భగవద్గీతలో ఉపనిషత్సారము పూర్తిగా అందించాడు. కాబట్టి దానిని మనం చదివి అధ్యయనం చేసి ఆచరించవలె కాని, ఎక్కడ చెప్పాడు, ఎప్పుడు చెప్పాడు, ఎలాచెప్పాడు, అది సాధ్యమా? ఇదిసాధ్యమా? అని కుశంకలతో పొద్దుపుచ్చకూడదు. అర్థంచేసుకొని ఆచరించడానికి ప్రయత్నం చేస్తే మనజన్మలు సార్థకం కనీసం భగవద్గీతలో ఒక్క శ్లోకం అన్నా చదివి, అర్థం చేసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తే మనజన్మలు సార్థకం అవుతాయి. కాని ఇలా సందేహాలు లేవ నెత్తుతుంటే నిత్యశంకితులుగానే మిగిలిపోతాము.
ఇంకా కొంతమందికి మరొక సందేహం వచ్చింది. 'భగవద్గీతలో చెప్పిందే చెప్పారండీ. శ్రీ కృష్ణుడు ఇలా చెప్పిందే చెప్పి సుత్తి కొడతాడా! వ్యాసుడు అలా రాస్తాడా! అందుకని ఇప్పుడు మనం చదివే భగవద్గీత అంతా వ్యాసుడు రాయలేదు. కాలక్రమేణా ఎన్నో శ్లోకములు ప్రక్షిప్తములు. (అనగా తరువాత ఇతరుల చేత చేర్చబడినవి అని అర్ధము) అయినాయి- అని కొంతమంది వాదన. ఆ వాదనకు అనుకూలంగా వారు అలాంటి ప్రక్షిప్తములను తొలగించి, ఒక సంక్షిప్త గీతను ప్రచురించారు కూడా.
ఈ వాదోపవాదాలలో నిజం ఉన్నా లేకపోయినా, ఒక్కటి మాత్రం నిజం. మనం సర్వజ్ఞులము కాము. మన మేధస్సు పరిమితం అయినది. ఒకసారి చెబితే అర్థం కాదు. పదే పదే చెప్పాలి. చెప్పవలసిన విషయం అతి క్లిష్టమయినది. కాబట్టి ఒక విషయం పలుమారు చెప్పినందువలన తప్పులేదు కదా!
*రేపు *
భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు
రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి

కామెంట్‌లు