బెజ్జంకి… పేరు వినగానే గుండెల్లో పులిహోర పులుపు లాంటి ఉత్సాహం… కన్నుల్లో పండగ వెలుగు…!
ఆధ్యాత్మిక శోభతో ముస్తాబై, దశాబ్దాల చరిత్రను మోస్తూ, జాతర జోష్‌తో మోగిపోతున్న బెజ్జంకి ఈ రోజుల్లో నిజంగానే పల్లె భారతానికి పండుగ పూట.
“పోదాం పోచమ్మ… బెజ్జంకి జాతర…” అంటూ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఊరంతా గుంపులుగా బయలుదేరే దృశ్యం చూస్తుంటే… ఆ మట్టి వాసనలోనే భక్తి పరిమళం కలిసిపోయినట్టు అనిపిస్తుంది.
చుట్టుపక్కల పది ఊళ్ల జనాలు…
ఆబాల గోపాలం…
ఒక్కో కుటుంబం ఒక్కో ఊరేగింపు…
ఇలా బెజ్జంకి జాతర అంటే జనం సముద్రమే!
ముఖ్యంగా ఈ గురువారం…(2ఏప్రిల్ 2026) చైత్ర శుద్ధ పున్నమి రోజు…
గుట్ట చుట్టూ ఎడ్ల బండ్లు తిరిగే ఆచారం చూడటానికి వేల కళ్ళు సరిపోవు.
ఎడ్లకు గంటలు కట్టుకుని… మెల్లగా అడుగులు వేస్తూ గుట్ట చుట్టూ తిరిగే బండ్లు చూస్తుంటే… అది కేవలం సంప్రదాయం కాదు, పూర్వీకుల జ్ఞాపకాలు తిరిగొస్తున్నట్టే ఉంటుంది.
అదే కాదు…
మేకల బండ్లు కూడా గుట్ట చుట్టూ తిరగటం ఈ జాతర ప్రత్యేకం!
చూసే వారికి నవ్వు, ఆశ్చర్యం, ఆనందం—all in one!
ఇక యువత సంగతి చెప్పాలంటే…
బైకులు గర్జిస్తుంటే… ట్రాక్టర్లు ఘోషిస్తుంటే… కార్లు వరుసగా తిరుగుతుంటే…
“మా మొక్కు నెరవేరాలి” అన్న నమ్మకంతో గుట్ట చుట్టూ తిరిగే ప్రతి చక్రంలో భక్తి తిరుగుతుంది.
ఈ జాతర అనుభవం…
చెప్పితే అర్థం కాదు…
చూస్తే మర్చిపోలేం…!
జై నరసింహ స్వామి!
జై జై నరసింహ స్వామి!
బెజ్జంకి జాతర అంటే పల్లె గుండె చప్పుడు… భక్తి ఊపు… సంబరాల సుడిగాలి!
దుమ్ము రేపిన .....బెజ్జంకి జాతర.: -ఎస్.వి.రమణా చార్య
• T. VEDANTA SURY

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి